హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా : ఇదీ జరిగింది.. ఇకనైనా ఆపండి భాయ్.. సంచలన వీడియో..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భారత్‌లో కరోనా వ్యాప్తికి కొత్త ఎపిసెంటర్‌గా మారిందన్నది రెండు రోజులుగా వార్తల్లో ఎక్కువగా నానుతున్న అంశం. దాదాపు 1000 నుంచి 2000 మంది మర్కజ్ ప్రార్థనలకు హాజరై తిరిగి స్వస్థలాలకు వెళ్లినట్టు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం వారికోసం ముమ్మరంగా వెతుకుతున్నాయి. చాలాచోట్ల వారిని గుర్తించి క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అనుమానిత లక్షణాలున్నా లేకపోయినా వైద్య పరీక్షలు నిర్వహించి క్వారెంటైన్‌లో ఉంచుతున్నారు. ఈ క్రమంలో కొంత తప్పుడు సమాచారం కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. మర్కజ్ వెళ్లి వచ్చినవారిలో కరోనా సోకనివారి ఫోటోలను కూడా ఫేస్‌బుక్,వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్ చేస్తూ వారికి కరోనా సోకినట్టు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన ఓ వ్యక్తి ఓ వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇదీ జరిగింది..

ఇదీ జరిగింది..

తాను,షాకీర్,ఖాసిం అనే ముగ్గురం కలిసి మార్చి 13వ తేదీన స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళ్లినట్టు ఆ ముస్లిం వ్యక్తి వీడియోలో పేర్కొన్నారు. అక్కడ ప్రతీ ఏటా జరిగే మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొన్నట్టు తెలిపారు. మార్చి 17వ తేదీ రాత్రి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు పయనమైనట్టు చెప్పారు. బుధవారం రాత్రి 12.30గంటలకు తాడేపల్లిగూడెంలో దిగినట్టు చెప్పారు. అక్కడి నుంచి ఓ క్వారీ లారీలో పెనుగొండకు చేరుకున్నట్టు చెప్పారు. అయితే అప్పటికే షాకిర్ భాయ్‌కి టైఫాయిడ్ ఉందని.. కానీ అతను అంతగా పట్టించుకోలేదని చెప్పారు. సుగర్,బీపీ కూడా ఉండటం.. ప్రయాణం వల్ల జ్వరం ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు.

కరోనా కాదు.. టైఫాయిడ్..

కరోనా కాదు.. టైఫాయిడ్..

ప్రస్తుతం పరిస్థితులు బాగా లేవు కదా డాక్టర్‌కు చూపించుకోమని చెబితే అతను నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిపారు. ఎట్టకేలకు నిన్న ఓ ఆసుపత్రికి వెళ్లి.. ఢిల్లీ నుంచి వచ్చామని.. జ్వరంగా ఉందని చెబితే.. అక్కడి వైద్యులు ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారని చెప్పారు. దీంతో ప్రభుత్వాసుపత్రి వైద్యులు పరీక్షించి.. ఇది మామూలు జ్వరమేనని చెప్పి మందులు ఇచ్చి పంపించారు. అయినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో మార్చి 31వ తేదీ రాత్రి అతన్ని తణుకు తీసుకెళ్లినట్టు చెప్పారు. అక్కడ వైద్య పరీక్షల్లో అతనికి టైఫాయిడ్‌గా తేలిందన్నారు. అతని మెడికల్ రిపోర్టుల్లోనూ టైఫాయిడ్ తప్ప కరోనా అని పేర్కొనలేదన్నారు.

హోం క్వారెంటైన్... సోషల్ మీడియాలో దుష్ప్రచారం..

హోం క్వారెంటైన్... సోషల్ మీడియాలో దుష్ప్రచారం..

ఢిల్లీ నుంచి రావడంతో అతన్ని హోమ్ క్వారెంటైన్ చేసి చేతిపై స్టిక్కరింగ్ చేసినట్టు తెలిపారు. ఇదే క్రమంలో తన ఇంటితో పాటు ఖాసీం ఇంటికి పోలీసులు వచ్చి క్వారెంటైన్ స్టిక్కరింగ్ చేసినట్టు తెలిపారు. ఆ సమయంలో పోలీసులతో పాటు వచ్చిన వలంటీరో.. లేదా ఆశా వర్కరో.. దాన్ని ఫోటో తీసినట్టు చెప్పారు. అయితే ఆ ఫోటో బయటకు ఎలా లీకైందో తెలియదు గానీ.. తన ఫోటో,షాకిర్ ఫోటో,ఖాసీం ఫోటోలను కొంతమంది సోషల్ మీడియాలో పెట్టి తమకు కరోనా సోకినట్టు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. అయితే అందులో నిజానిజాలు తెలుసుకోకుండా చాలామంది దాన్ని షేర్ చేసినట్టు తెలిపారు. దీంతో రాత్రి నుంచి తమ శిష్యులు,బంధువులు,బయటి దేశాల్లో ఉన్నవారు ఫోన్లు చేస్తూనే ఉన్నారని చెప్పారు.

ఇకనైనా ఆపండి భాయ్ అంటూ విజ్ఞప్తి..

ఇకనైనా ఆపండి భాయ్ అంటూ విజ్ఞప్తి..

ఇదంతా చూసి తన భార్యా,పిల్లలు తీవ్రంగా బాధపడుతున్నట్టు చెప్పారు. నిజాలు తెలుసుకోకుండా ఎదుటివాళ్ల హక్కులను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తుండటంతో.. వాళ్లందరికీ ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేక ఇలా వీడియో చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికైతే తమకెలాంటి అనారోగ్యం లేదని.. ప్రస్తుతం తాము ఆరోగ్యంగానే ఉన్నామని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇలాంటి తప్పుడు ప్రచారాలతో అలజడి రేపడం సరికాదన్నారు. 'ఇప్పటికైనా తమపై దుష్ప్రచారం చేయవద్దు భాయ్..' అంటూ విజ్ఞప్తి చేశారు.
కాగా,ఇప్పటివరకు ఏపీలో 87 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరోజులోనే 14 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

English summary
A man from West Godavari district who recently attended Nizamuddin Markaz Tablighi Jamat in Delhi made an appeal through a video to people to stop spreading fake news against them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X