‘రాంచరణ్, మనోజ్! శబరిమల ఇష్యూపై స్పందించరా?’: నెటిజన్ ప్రశ్న, సూపర్ రిప్లై ఇచ్చిన మంచు

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ కథానాయకులు రాంచరణ్, మంచు మనోజ్‌లు అయ్యప్పస్వామి మాల వేసుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలావుంటే, గత కొద్ది రోజులుగా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంపై ఆందోళనలు జరుగుతున్న విషయం విధితమే. ఆలయ సాంప్రదాయాలను కాపాడాలంటూ కేరళలోని అయ్యప్ప భక్తులు, మహిళలు.. భారీ ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు.

మీరు స్పందించాలంటూ నెటిజన్..
పదేళ్లలోపు, 50ఏళ్ల పైబడిన ఆడవారికి మాత్రమే శబరిమల ఆలయంలోకి ప్రవేశం ఉండగా.. ఇటీవల సుప్రీంకోర్టు అన్ని వయస్సుల మహిళలకు ఆలయ ప్రవేశాన్ని అనుమతించడంతో కేరళలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్క మహిళను కూడా ఆందోళనకారులు ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అయ్యప్పస్వామి మాల వేసుకున్న రాంచరణ్, మనోజ్‌లకు ఓ నెటిజన్ ప్రశ్నలు సంధించారు. శబరిమల ఆలయ ప్రవేశం విషయంపై స్పందించాలని కోరారు.

శివానీ అనే యువతి ప్రశ్న..
‘శబరిమల గురించి స్వామి దీక్షలో ఉన్న మంచు మనోజ్, రామ్‌చరణ్ ఎందుకు స్పందించలేదు' అని ఓ యువతి సినీ నటుడు మనోజ్‌ను ప్రశ్నించింది. కాగా, రుతుక్రమం జరిగే వయసున్న మహిళల కోసం అదనపు సౌకర్యాల్ని కల్పించేంతవరకు వారి ప్రవేశాన్ని నిరోధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కేరళ హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. ఇప్పటికే ఈ విషయం గురించి ఎందరో సినీ ప్రముఖులు కూడా స్పందించారు.
జోక్యం వద్దు: శబరిమల ఆలయ ప్రవేశంపై రజినీకాంత్, 90శాతం పార్టీ పనులు పూర్తి, మీటూపై ఇలా

రాంచరణ్, మనోజ్ ఫొటోలు పెట్టి..
కాగా సినీ నటులు మంచు మనోజ్, రామ్‌చరణ్.. అయ్యప్ప మాలను ధరించినప్పటికీ శబరిమల సమస్య గురించి స్పందించలేదు. దీంతో వీరిద్దరూ మాలలో ఉన్న ఫొటోలను శివాని అనే నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ మనోజ్‌ను ట్యాగ్ చేశారు.
మనోజ్.. సూపర్ రిప్లై..
‘మనోజ్, రామ్‌చరణ్..ఇకనైనా మీరు శబరిమల విషయంపై నోరు విప్పండి' అని కోరారు. ఇందుకు మనోజ్ స్పందిస్తూ..‘పేదలకు తిండి, నీరు, చదువు వంటి సౌకర్యాలు అందడంలేదని మేమంతా చింతిస్తున్నాం. మనం ముందు వారి గురించి ఆలోచించాలి. మనందరికీ దేవుడిపై నమ్మకం ఉంది కదా... అలాంటప్పుడు ఆయనకు వచ్చిన సమస్యను ఆయనే పరిష్కరించుకుంటాడు. మనమంతా మానవత్వంవైపు నిలబడదాం. లవ్యూ ఆల్' అని సమాధానమిచ్చారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!