వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడెల ఫ్యామిలీని వెంటాడుతున్న కేసులు.. కొడుకు.. కూతురు.. ఇప్పుడు మాజీ స్పీకర్! ఇంకా ఎన్ని?

|
Google Oneindia TeluguNews

కే టాక్స్‌ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కోంటున్న ఏపీ మాజీ స్పికర్ కోడేల శివప్రసాద్ కుటుంభంపై మరో కేసు నమోదు అయింది. రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కోడేల శివరామ్ ఆంధ్ర రంజీ క్రికెట్ క్రిడాకారుడి వద్ద డబ్బలు వసూలు చేశాడని నరసారావు పేట టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

రంజీ క్రికెటర్ వద్ద ఉద్యోగం పేరుతో 15లక్షల వసూలు

రంజీ క్రికెటర్ వద్ద ఉద్యోగం పేరుతో 15లక్షల వసూలు

ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కోంటున్న కోడేల కుటుంభంపై మరోకేసు నమోదు అయింది. శ్రీకాకుళం జిల్లా పోలాకీ మండలం యవ్వారీపేటకు గ్రామానికి చెందిన నాగరాజు గత అయిదు సంవత్సరాలుగా ఆంధ్ర రంజీ జట్టు నుండి క్రికెట్ అడుతున్నాడు. నాగరాజుకు రైల్వే శాఖలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కోడేల శివరాం 15 లక్షల రుపాయలు వసూలు చేశాడని, అయితే ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశారని, తిరిగి డబ్బలు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని నాగరాజు నరసారావు పేట డీఎస్సీకి పిర్యాధు చేశారు.

విషయం చెప్పినా స్పందించని మాజీ స్పీకర్

విషయం చెప్పినా స్పందించని మాజీ స్పీకర్

అయితే ఇదే విషయమై స్పికర్‌గా ఉన్న సమయంలో శివప్రసాద్ రావు సమాచారం ఇచ్చినా ఆయన స్పందించలేదని తెడలిపారు.ఇక ఉద్యోగాన్ని ఇస్తానని చెప్పి 15 లక్షలు తీసుకున్నట్టు శివరాం బాంబు ఇవ్వడంతో పాటు ఉద్యోగానికి సంబంధించి నియామక పత్రాలను ఇచ్చి కాన్పూర్‌కు వెళ్లమని చెప్పాడని , అయితే కాన్పూరుకు వెళ్లిన నాగరాజు అక్కడ ఉన్న వ్యక్తిని కలవడంతో రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ పడ్డప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి పంపించాడని తెలిపారు.

డబ్బులు ఇస్తామని దాడి...

డబ్బులు ఇస్తామని దాడి...

అయితే కోడేల శివరాంపై ఇటివల వరుస కేసులు నమోదవుతుండడంతో గత వారం నాగరాజు కోడేల ఇంటికి ఉద్యగం విషయం వెళ్లాడు. దీంతో డబ్బలు ఇస్తామని చెప్పి రమ్మన్నారని, ఇంటికి వెళ్లిన తర్వాత కోడేల ఇంటివద్ద ఉన్న కొంతమంది ఆయన అనుచరులు నాగరాజుపై దాడి చేశారని,అనంతరం తన వద్ద బాండ్ పేపరును గుంజుకోవడంతో పాటు దాన్ని చింపి వేశారని నాగరాజు పిర్యాధు చేశారు.కాగా ఇప్పటికే కోడెల శివప్రసాద్ కూతురు, కుమారుడిపై ఇప్పటికే సుమారు 10 కేసులు నమోదయ్యాయి.

English summary
a police case were lodged aganist Former AP Speaker Kodela Sivaprasad in Two town Police of Narasaraopet,for taking 15 lakh money to get railwy job has already 10 cases wer booked against Former AP Speaker Kodela Sivaprasad's family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X