అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాడిపత్రి పోలీసుల్లో ఇంటి దొంగ: టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు కోవర్ట్ గా: దాడుల సమాచారం లీక్..!

|
Google Oneindia TeluguNews

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక పోలీసు అధికారి తీరు వివాదాస్పదంగా మారుతోంది. జిల్లా పోలీసు బాస్ అరాచక శక్తుల ఆటకట్టించే ప్రయత్నం చేస్తుంటే..ఆ ప్రణాళిక సమాచారం ముందుగానే నేరగాళ్లకు అందిస్తున్నారని ఆ అధికారి మీద ఆరోపణ. టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు సన్నిహితుడిగా ఆ అధికారికి పేరుంది. జిల్లా పోలీసు అధికారులు పక్కా ప్రణాళికతో వెళ్తే అప్పటికే అక్కడ మట్కా డాన్‌ రషీద్‌తో పాటు క్రికెట్‌ బుకీలు దాడుల కంటే ముందుగానే అక్కడి నుంచి తప్పించుకుపోయారు.

వెళుతున్నా, ప్రధాన నిర్వాహకులు చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం వెనుక సొంత శాఖలోనే ఓ లీకు వీరుడు ఉన్నాడని గుర్తించారు. ముఖ్యంగా టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి మరీ దాడుల సమాచారం చేరవేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది.

పోలీసు శాఖలో లీకు వీరుడు..

పోలీసు శాఖలో లీకు వీరుడు..

జిల్లాలో మట్కా నిర్వాహకులు..క్రికెట్ బుకీలను పట్టుకొనేందుకు పక్కా ప్లాన్ తో సిద్దమవ్వటం..వారు సరిగ్గా పట్టుకొనే సమయానికి తప్పించుకోవటం కొద్ది రోజులుగా తాడిపత్రిలో కొనసాగుతోంది. పోలీసు శాఖ ఎంతో గోప్యంగా దాడులకు ప్లాన్‌ చేస్తున్నా.. సమాచారం అసాంఘిక శక్తులకు ముందుగానే చేరిపోతోంది. ఈ వ్యవహారంలో ఓ పోలీసు అధికారి హస్తం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీని కారణంగానే తాజాగా తాడిపత్రి నియోజకవర్గంలోని మట్కా డాన్‌ రషీద్‌తో పాటు క్రికెట్‌ బుకీలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోగలిగారని పోలీసు శాఖలోనే చర్చ జరుగుతోంది. గతంలో జిల్లావ్యాప్తంగా ఉన్న మట్కాడాన్‌లతో పాటు క్రికెట్‌ బుకీలు, గ్యాంబ్లర్ల భరతం పట్టేందుకు జిల్లా ఎస్పీ సత్యయేసు బాబు సిద్ధమయ్యారు. ఆ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మట్కాడాన్లు, క్రికెట్‌బుకీల జాబితాను పోలీసు ఉన్నతాధికారులు సిద్ధం చేశారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు సమాచారం ఇస్తూ..

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు సమాచారం ఇస్తూ..

కేవలం జిల్లా పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లోని కీలకమైన అధికారులకు మాత్రమే ఈ సమాచారం ఉంది. ఆ వ్యక్తులు ఎక్కడెక్కడ ఉంటున్నారు.. ఏ విధంగా పట్టుకోవాలనే పక్కా ప్లాన్‌ను కూడా అధికారులు వేసుకున్నారు. సిద్ధం చేసిన జాబితాలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అనుచరులు కూడా ఉన్నారు. ఇదే సమయంలో ఆ కీలక సమాచారాన్ని పోలీసు శాఖలోని ఓ లీకు వీరుడు నేరుగా ఆ మాజీ ఎమ్మెల్యేకే ఫోన్‌ చేసి చేరవేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన సహకారంతోనే తప్పించుకున్నారని భావిస్తున్నారు. దీంతో.. ఈ వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి పైన గతంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నాయి.

టీడీపీ అనుకూలమనే విమర్శ..

టీడీపీ అనుకూలమనే విమర్శ..

ఆ పోలీసు అధికారి గతంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయంగానూ ప్రత్యర్ధి పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తనకు సన్నిహితంగా ఉండే మాజీ ఎమ్మెల్యేకు అంద చేసే వారని చెబుతున్నారు. ఇప్పుడు అదే అధికారి తిరిగి ఒక మాజీ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల మీద ఉన్నతాధికారులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. విచారణ తరువాత ఆ పోలీసు అధికారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.

English summary
A police officer in Tadipatri facing allegations that working as covert for Ex mla to leak the information in dist police head quarters on attacks on cricket bokkies. Police higher officials started invetigation on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X