వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురంధేశ్వరికి టిడిపి హెల్ప్ కావాల్సిందేనా!? (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విశాఖ: మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి విశాఖపట్నంలో గెలుపు అంత ఈజీ కాదా? అంటే అవుననే అంటున్నారు. పురంధేశ్వరి బుధవారం ఉదయం తన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలతో విశాఖలో భేటీ అయి బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమె రాకను రాష్ట్ర బిజెపి నేతలతో పాటు విశాఖ బిజెపి ఇంఛార్జి కూడా స్వాగతించారు.

అయితే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుంటే విశాఖలో ఆమె పోటీ అంత ఈజీ కాదని చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆమె తీరు పట్ల స్థానిక విద్యార్థులు, ఐక్యకార్యాచరణ సమితి ఆగ్రహంతో ఉందంటున్నారు. టిడిపితో పొత్తు పెట్టుకుంటేనే ఆమె గెలుపుకు అవకాశాలున్నాయని చెబుతున్నారు.

మరోవైపు పురంధేశ్వరిని విజయవాడ నుండి కూడా బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదంటున్నారు. బిజెపిలో చేరేందుకు తాను ఎలాంటి షరతులను పెట్టనని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె విశాఖ నుండి పోటీ చేస్తారా లేక విజయవాడ నుండి చేస్తారా అనేది త్వరలో తేలనుంది.

పురంధేశ్వరి

పురంధేశ్వరి

తాను ఎలాంటి షరతులు విధించకుండా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నానని మాజీ కేంద్రమంత్రి, విశాఖ పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం చెప్పారు.

అనుచరులతో

అనుచరులతో

ఉదయం ఆమె విశాఖలో కార్యకర్తలు, అనుచరులు, అభిమానులతో భేటీ అయ్యారు. ఈ నెల 13న బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఆధ్వర్యంలో బిజెపిలో చేరనున్నారు.

దగ్గుబాటి వెంకటేశ్వర రావు

దగ్గుబాటి వెంకటేశ్వర రావు

తాను ఎలాంటి షరతులు లేకుండా బిజెపిలో చేరుతానని, తాను రేపు ఢిల్లీకి వెళ్లి సుష్మా స్వరాజ్, అద్వానీ, అరుణ్ జైట్లీలను కలుస్తానని పురంధేశ్వరి బుధవారం చెప్పారు.

కార్యకర్తలు

కార్యకర్తలు

పార్టీలో చేరుతున్నా తన నుండి వారిపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని, తాను ఇప్పటి వరకు పలు పార్టీలతో మాట్లాడినట్లుగా ప్రచారం సాగిందని కానీ, అది అవాస్తవమని పురంధేశ్వరి చెప్పారు.

దగ్గుబాటి వెంకటేశ్వర రావు

దగ్గుబాటి వెంకటేశ్వర రావు

ఇప్పటి వరకు తాను ఏ పార్టీలతో చర్చలు జరపలేదని, తన కార్యకర్తలను కలిసిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నానని పురంధేశ్వరి చెప్పారు. తనతో కలిసి రావాలని ఎవరి పైన తాను ఒత్తిడి చేయడం లేదని చెప్పారు. కాంగ్రెసు పార్టీని వీడటం బాధాకరమే అయినా తప్పడం లేదన్నారు. తాను ఏ పార్టీలో చేరినా విశాఖ నుండే పోటీ చేస్తానని ఆమె చెప్పారు.

కార్యకర్తలు

కార్యకర్తలు

జగన్, కెసిఆర్ ఉన్నారనే... కాంగ్రెస్ పైన నిప్పులు బిజెపిలో చేరనున్నట్లు ప్రకటించిన పురంధేశ్వరి కాంగ్రెసు పార్టీ పైన మండిపడ్డారు. తమను పట్టించుకోకుండా కాంగ్రెసు పార్టీ విభజన చేసిందన్నారు.

దగ్గుబాటి

దగ్గుబాటి

తమ సూచనలు ఏవీ పట్టించుకోలేదన్నారు. తన నియోజకవర్గం గురించిన అంశాలు కూడా తనను తీవ్రంగా బాధించాయన్నారు. సీమాంధ్రకు కాంగ్రెసు పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏం చేద్దాం?

ఏం చేద్దాం?

సీమాంధ్రలో ఒక్క సీటు రాకున్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉందనే అభిప్రాయం కాంగ్రెసు పార్టీ అధిష్టానంలో ఉందన్నారు. తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో జగన్ పార్టీ ఉన్నాయని కాంగ్రెస్ ధీమాతో ఉందన్నారు. అందుకే విభజన చేసిందన్నారు.

టిడిపి సహకరించాల్సిందేనా..?

టిడిపి సహకరించాల్సిందేనా..?

2014 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుంటే విశాఖలో ఆమె పోటీ అంత ఈజీ కాదని చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆమె తీరు పట్ల స్థానిక విద్యార్థులు, ఐక్యకార్యాచరణ సమితి ఆగ్రహంతో ఉందంటున్నారు. టిడిపితో పొత్తు పెట్టుకుంటేనే ఆమె గెలుపుకు అవకాశాలున్నాయని చెబుతున్నారు.

English summary
Even as the decks have been cleared for sitting Congress MP Daggubati Purandeswari to join the BJP, sources said it may be a herculean task for her to win on a BJP ticket from Visakhapatnam unless the saffron party ties up with TDP because of various factors including her non-local status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X