వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడ బీచ్ లో ప్రత్యేక ఆకర్షణగా... నావికా దళంలో విశేష సేవలందించిన యుద్ధ విమానం టియు 142

|
Google Oneindia TeluguNews

భారత నావికాదళంలో ఎన్నో ఏళ్ళ నుండి విశేష సేవలందించిన టియు 142 యుద్ధ విమానం ఇకనుండి కాకినాడలో కనువిందు చేయనుంది. భారత నావికా దళంలో రెండున్నర దశాబ్దాలకు పైగా సముద్ర గస్తీలో కీలక పాత్ర పోషించిన శత్రువులకు ముచ్చెమటలు పట్టించిన విమానం కాకినాడలో ప్రదర్శనకు ముస్తాబవుతోంది. కాకినాడ బీచ్ లో టీయు 142 యుద్ధ విమానాన్ని ప్రదర్శించడం కోసం గోదావరి నగర అభివృద్ధి సంస్థ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుందని తెలుస్తుంది.

స్వతంత్ర్య భారతదేశంలో ఉరి తీయబడుతున్న మొట్టమొదటి మహిళ .. ఆమె భయంకర నేర చరిత్ర ఇదే !!స్వతంత్ర్య భారతదేశంలో ఉరి తీయబడుతున్న మొట్టమొదటి మహిళ .. ఆమె భయంకర నేర చరిత్ర ఇదే !!

సముద్రంపై గస్తీ విమానంగా పనిచేసిన టీయు 142

సముద్రంపై గస్తీ విమానంగా పనిచేసిన టీయు 142

25 సంవత్సరాలకుపైగా శత్రువులకు ముచ్చెమటలు పట్టించి, సముద్రంపై నిఘా విమానంగా పనిచేసిన టీయు 142 ప్రస్తుతం నావికాదళం నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ యుద్ధ విమానాన్ని ప్రదర్శన కోసం నావికాదళం కాకినాడకు కేటాయించింది. ఇప్పటికే విశాఖలో ఈ విమాన ప్రాజెక్టు అక్కడి వారిని ఆకర్షిస్తూ ఉండగా, కాకినాడలో కూడా విశాఖ తరహాలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

గోదావరి నగర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 5.8 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్తున్నారు.

కాకినాడ బీచ్ పార్క్ లో ఏర్పాటు చేసిన దీపక్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాంగణంలోనే టీయు 142

కాకినాడ బీచ్ పార్క్ లో ఏర్పాటు చేసిన దీపక్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాంగణంలోనే టీయు 142

ఇంతకుముందు కాకినాడ బీచ్ లోని పార్క్ లో ఏర్పాటు చేసిన దీపక్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాంగణంలోనే దీన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక దీని ఏర్పాటు ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ప్రాజెక్టు హెడ్ కెప్టెన్ వెంకటేష్ పేర్కొన్నారు. భారత నావికా దళం ఈ రకానికి చెందిన ఎనిమిది ఎయిర్ క్రాఫ్ట్ లను కొనుగోలు చేసిందని ఇవన్నీ కలిపి ముప్పై మూడు గంటలకు పైగా ప్రయాణించాయని కెప్టెన్ వెంకటేష్ తెలిపారు. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ లతో ఎప్పుడూ ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు .

'విజయ్' వంటి ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్న ఎయిర్ క్రాఫ్ట్ తో కాకినాడకు పర్యాటక సొబగులు

'విజయ్' వంటి ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్న ఎయిర్ క్రాఫ్ట్ తో కాకినాడకు పర్యాటక సొబగులు

టీయూ 142 అతి పెద్దదైన ఎయిర్ క్రాఫ్ట్ మాత్రమే కాదని సురక్షితమైన ఎయిర్ క్రాఫ్ట్ కూడా అని ప్రాజెక్టు హెడ్ తెలిపారు. 'విజయ్' వంటి ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు అరక్కోణం లోని ఐఎన్ ఎస్ రజాలీలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ భాగాలను విడదీశారు అని పేర్కొన్నారు. రోడ్డు మార్గం ద్వారా ఈ విడి భాగాలు కాకినాడ బీచ్ కు చేరుకున్నాయని, ఈ నెలాఖరులోగా అమరిక పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. తనీజ ఏరోస్పేస్ ఆధ్వర్యంలో విమాన విడిభాగాల అమరిక జరుగుతోంది . ఈ ప్రాజెక్టు పూర్తయితే కాకినాడ బీచ్ కు మరింత పర్యాటక గుర్తింపు వస్తుందని అందరూ భావిస్తున్నారు.

English summary
TU142 fighter jet, which has served in the Indian Navy for many years, will now land in Kakinada. The aircraft, which has played a key role in the Indian Navy's maritime patrol for more than two and a half decades, is set to be displayed at Kakinada. The Godavari urban Development Corporation is busy making arrangements for the display of the TU142 fighter jet at Kakinada Beach. It is expected to be available to the public in a few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X