వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైద‌రాబాద్ విమానానికి త‌ప్పిన ముప్పు: రేణిగుంట‌లో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌!

|
Google Oneindia TeluguNews

తిరుప‌తి: స్పైస్‌జెట్ విమానానికి పెను ముప్పు తప్పింది. పైలెట్ అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం వ‌ల్ల విమానం సుర‌క్షితంగా నేల‌కు దిగింది. విమానాశ్ర‌యం నుంచి టేకాఫ్ తీసుకున్న వెంట‌నే పైలెట్ విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంట‌నే- వెన‌క్కి మ‌ళ్లించారు. విమానం సుర‌క్షితంగా ల్యాండ్ కావ‌డంతో ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న బుధవారం ఉద‌యం చిత్తూరు జిల్లా రేణిగుంట అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో చోటు చేసుకుంది.

స్పైస్‌జెట్ విమానం ఈ తెల్ల‌వారు జామున రేణిగుంట నుంచి హైద‌రాబాద్‌కు బ‌యలుదేరింది. ఆ స‌మ‌యంలో విమానంలో 40 మంది ప్ర‌యాణికులు, సిబ్బంది ఉన్నారు. విమానం టేకాఫ్ తీసుకున్న రెండు నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు పైలెట్‌. వెంట‌నే- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. విమానాన్ని వెన‌క్కి మ‌ళ్లించారు. అత్య‌వ‌స‌ర ల్యాండ్ చేశారు.

A SpiceJet Flight was halted at the Renigunta International Airport due to a technical snag after take-off

సుమారు రెండు గంట‌ల నుంచి ఈ విమానం రేణిగుంట అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలోనే నిలిచిపోయింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే సాంకేతిక సిబ్బంది విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. ఇంజిన్ లోపాన్ని స‌రిచేస్తున్నారు. విమానం టేకాఫ్ తీసుకోవ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌యాణికుల‌ను రేణిగుంట‌లో ఉన్న హోట‌ల్‌కు త‌ర‌లించారు.

English summary
Andhra Pradesh: A SpiceJet, Hyderabad to Renigunta flight was halted at the Renigunta International Airport due to a technical snag. Pilot identified the snag after take-off, following which the aircraft was landed safely. 40 passengers were on-board at the time of incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X