వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముచ్చటగా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న నిత్య పెళ్ళికొడుకీ ఉపాధ్యాయుడు

|
Google Oneindia TeluguNews

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు, విద్యార్థులను సరైన మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడు వక్ర మార్గంలో నడిచాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. అవనిగడ్డకు చెందిన ఓ ప్రభుత్వ టీచర్ ముగ్గురిని పెళ్లాడి నిత్య పెళ్ళికొడుకు గా మారిన వైనం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది . సభ్య సమాజం షాక్ అయ్యేలా చేస్తుంది.

<strong>సోషల్ మీడియాలో పరిశ్రమలు వెనక్కు పోతున్నాయని దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ .. ప్రకటన విడుదల</strong>సోషల్ మీడియాలో పరిశ్రమలు వెనక్కు పోతున్నాయని దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ .. ప్రకటన విడుదల

ఓ ప్రభుత్వ టీచర్‌ తనను పెళ్లి చేసుకుని మోసం చేసి మరో రెండు పెళ్ళిళ్లు చేసుకున్నాడని ఆరోపిస్తూ మొదటి భార్య శాంతి ప్రియ గుంటూరులో జరిగిన స్పందన కార్యక్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త సురేష్ తనను కాకుండా మరో ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలు చెప్పిన వివరాలను బట్టి గుంటూరులోని సంజీవయ్యనగర్‌కు చెందిన శాంతిప్రియకు కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన శీలం సురేష్‌కు 2012లో వివాహం జరిగింది. ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న సురేష్ పెళ్ళైన ఏడాదికి భార్యను వదిలి వెళ్ళిపోయాడు . భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో సురేష్ భార్యను పుట్టింటి వద్ద వదిలి వెళ్ళిపోయాడు. ఆమె గుంటూరు నగరంలోని అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

A teacher who has had three weddings... wife complaint

ఇక శాంతిప్రియకు విడాకులు ఇవ్వకుండానే సురేష్ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. 2014లోనే సురేష్‌ ఉయ్యూరుకు చెందిన శైలజను రహస్యంగా రెండో పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఓ కుమార్తె జన్మించింది. రెండేళ్ళు ఆమెతో కాపురం సాగించిన సురేష్‌ 2017లో కూతురు పుట్టిందని, రెండో భార్య శైలజకు ఉద్యోగం లేదని సాకుతో శైలజను కూడా వదిలి వేశాడు. ప్రస్తుతం సురేష్‌ చాట్రాయి ప్రభుత్వ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నాడు. సమీపంలోని విసన్నపేట ప్రభుత్వ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న కర్ర అనూషను సురేష్‌ మూడునెలల క్రితం మళ్ళీ మూడో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని బాధితురాలు శాంతిప్రియ ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం కావాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
First wife Shanti Priya has lodged a complaint with the police in Guntur in spandana program alligating that a government teacher had married her and cheated . She complained that her husband Suresh had married two other women without giving any divorce to her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X