అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలు జిల్లాలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామం ..దండోరా వేసి మరీ ఏం చెప్పారంటే..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మొదటి దశ నామినేషన్ల పరిశీలన నేటి నుంచి జరుగుతోంది. ఈనెల 9వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలను విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఓవైపు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార , ప్రతిపక్ష పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో గ్రామస్థాయిలో ప్రజలను ఓటు బ్యాంకుగా మలచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు బరిలోకి దిగాలని ప్రయత్నాలు జరుగుతున్న వేళ, ఓ గ్రామం పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గా ప్రకటించింది.

అక్కడ కేంద్రబలగాలతో ఎన్నికలు నిర్వహించాలి .. ఎస్ఈసి నిమ్మగడ్డకు టీడీపీ నేతల విజ్ఞప్తిఅక్కడ కేంద్రబలగాలతో ఎన్నికలు నిర్వహించాలి .. ఎస్ఈసి నిమ్మగడ్డకు టీడీపీ నేతల విజ్ఞప్తి

ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్న కర్నూలు జిల్లా కోడుమూరు పరిధిలోని పూడూరు గ్రామస్తులు

ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్న కర్నూలు జిల్లా కోడుమూరు పరిధిలోని పూడూరు గ్రామస్తులు

తమ ఊర్లో ఎన్నికలు జరగవని, ఎన్నికలను బహిష్కరించాలని దండోరా వేయించింది ఏపీలోని ఓ కుగ్రామం .
కర్నూలు జిల్లా కోడుమూరు పరిధిలోని పూడూరులో మంగళవారం నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయ వద్దని, గ్రామస్తులు ఈ ఎన్నికలను బహిష్కరించాలని గ్రామస్తులంతా సమావేశమై తీర్మానం చేశారు. ఎన్నోమార్లు తమ గ్రామానికి రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేసినా, ఎవరూ పట్టించుకోలేదని ఇక తమ గ్రామానికి రోడ్డు లేని కారణంగానే పంచాయితీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు ప్రకటిస్తున్నారు.

 రోడ్ల దుస్థితిపై అసహనం .. అందుకే ఈ నిర్ణయం

రోడ్ల దుస్థితిపై అసహనం .. అందుకే ఈ నిర్ణయం

ఏళ్లతరబడి ఈ సమస్య తమను ఇబ్బంది పెడుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఎన్నికల సమయంలో తమ వేదనను రాష్ట్రానికంతటికీ అర్థం అయ్యేలా చేశారు. పూడూరు గ్రామంలో రెండు వేల వరకు జనాభా ఉన్నారు, 15 సంవత్సరాల క్రితం వెంకయ్య పల్లె క్రాస్ రోడ్ నుండి గూడూరు వరకు తారు రోడ్డు వేశారు. ఆ రోడ్ ఇసుక రీచ్ ల నుండి వాహనాలు ఎక్కువ లోడుతో తిరగడంతో ర గుంతలు పడిపోయి, అధ్వానంగా తయారయ్యింది .

 రోడ్లు సరిగా లేని కారణంగా గ్రామస్తుల పాట్లు .. పలువురు మరణించారని ఆవేదన

రోడ్లు సరిగా లేని కారణంగా గ్రామస్తుల పాట్లు .. పలువురు మరణించారని ఆవేదన

ఇక గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసినా టెండర్ల విషయంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారినా గ్రామం లో రోడ్ల పరిస్థితి అలాగే ఉండిపోయింది. అనారోగ్యంగా ఉన్న వారిని, ప్రమాదంలో గాయపడిన వారిని ఎవరినైనా ఆసుపత్రికి తీసుకు వెళ్లాలంటే గ్రామస్తులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటి వరకు రోడ్డు సరిగా లేని కారణంగా సకాలంలో ఆసుపత్రులకు తీసుకు వెళ్లలేక ఏడుగురు మరణించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలను బహిష్కరిస్తూ తీర్మానం .. గ్రామంలో దండోరా

ఎన్నికలను బహిష్కరిస్తూ తీర్మానం .. గ్రామంలో దండోరా

రోడ్లు లేని కారణంగా తమకు ఎన్నికలు నిర్వహించవద్దని, పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని వారు చెబుతున్నారు. అంతేకాదు పూడూరు గ్రామంలో ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించిన గ్రామస్తులు ఏకంగా దండోరా వేయించి ఎన్నికల బరిలోకి ఎవరు దిగవద్దని చెబుతున్నారు. గ్రామస్తులంతా మూకుమ్మడిగా తీసుకున్న ఈ నిర్ణయంతో నైనా పూడూరు గ్రామం పై ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తారో లేదో వేచి చూడాలి.

English summary
Pudur under Kodumuru in Kurnool district boycotting the elections. However, the villagers decided to boycott this election as there is no longer a road to their village from so many years, despite repeated appeals to the govt .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X