వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుఫాన్ దెబ్బకు ఆగిన పెళ్లి ... వధూవరుల ఆశలపై నివర్ నీళ్ళు .. అసలేం జరిగిందంటే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాన్ ప్రభావం ఓ పెళ్లి మీద కూడా పడింది. నివర్ తుఫాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. నివర్ తుఫాన్ కారణంగా వీచిన బలమైన చలిగాలులకు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇక ఈ సమయంలో తుఫాను కారణంగా నిన్న జరగాల్సిన ఒక పెళ్ళి వాయిదా వేసుకోవలసి వచ్చింది.

కడప ,ప్రకాశం జిల్లాలలో నివర్ బీభత్సం ఇలా: శ్రీవారి మెట్ల మార్గం తాత్కాలిక మూసివేతకడప ,ప్రకాశం జిల్లాలలో నివర్ బీభత్సం ఇలా: శ్రీవారి మెట్ల మార్గం తాత్కాలిక మూసివేత

 పెళ్లి కావాల్సిన జంట ఆశలపై నీళ్ళు పోసిన నివర్ తుఫాను

పెళ్లి కావాల్సిన జంట ఆశలపై నీళ్ళు పోసిన నివర్ తుఫాను

వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లాలో పెద్దమండ్యం మండలం పాపేపల్లి వద్ద వాగు దాటి కళ్యాణ మండపానికి రాలేక ఏకంగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు వధువు తరపు బంధువులు. పాపేపల్లికి చెందిన యువతికి, బి.కొత్తకోట మండలం దేవరాజు పల్లెకు చెందిన యువకుడికి వివాహం నిశ్చయమైంది. శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. వధువు వరుడూ ఒక్కటవుతారని అంతా ఆశగా ఎదురుచూసిన వేళ వాళ్ళ ఆశలపై నివర్ నీళ్ళు పోసింది. నిన్న ఉదయం 5 గంటలకు ఈ వివాహ వేడుకకు ముహూర్తం కాగా వధువు రాలేని పరిస్థితిలోపెళ్లి ఆగిపోయింది .

పెళ్ళికి అంతా రెడీ అయ్యాక మండపానికి రాలేక పోయిన వధువు

పెళ్ళికి అంతా రెడీ అయ్యాక మండపానికి రాలేక పోయిన వధువు

వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు గట్టు లోని శ్రీ వెంకటరమణ స్వామి కళ్యాణ మండపం లో చేశారు. ఇక వధువు తరపు బంధువులంతా పెళ్లి మండపానికి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. ఓ బస్సును కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే కుండపోతగా కురుస్తున్న వర్షం కారణంగా పాపేపల్లి వద్ద ఉన్న వాగుకు వరద పోటెత్తింది. దీంతో పాపేపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వధువు పెళ్లి మండపానికి చేరుకోవాలంటే వాగును దాటి రావాల్సి ఉన్న నేపథ్యంలో, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు లో నుంచి దాటి రాలేక వివాహాన్ని వాయిదా వేసుకున్నారు వధువు బంధువులు.

Recommended Video

#NivarCyclone : నివర్ తుఫాన్ ప్రభావం పై CM జగన్‌ సీఎంవో అధికారులతో సమీక్ష సమావేశం!
 ఆగిన పెళ్లి ... మరో ముహూర్తానికి పెళ్లి చెయ్యాలని నిర్ణయం ... నివర్ ఎంతపని చేసింది

ఆగిన పెళ్లి ... మరో ముహూర్తానికి పెళ్లి చెయ్యాలని నిర్ణయం ... నివర్ ఎంతపని చేసింది

ఈ విషయాన్ని ఫోన్ ద్వారా వరుడు బంధువులకు చెప్పి మరో ముహూర్తానికి వివాహం చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. పెళ్లి మీద ఎన్నో కలలు గన్న వధూ వరులు నివర్ మీద కోపంతో నిప్పులు కురిపిస్తున్నారు . మొత్తానికి నివర్ తుఫాన్ దెబ్బకు చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలు కురుస్తున్న భారీ వర్షాలతో, తీవ్రమైన చలి గాలులతో చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇదే సమయంలో నివర్ దెబ్బకు ఓ వివాహం కూడా ఆగి పోవడం గమనార్హం.

English summary
In the state of Andhra Pradesh, the impact of Nivar cyclone also fell on a wedding. The bride's relatives have postponed the wedding as they could not reach the wedding hall after crossing the stream at Papepalli in Peddamandyam mandal in Chittoor district. bride groom from Devaraja Palle, B. Kottakotta Mandal. The wedding was supposed to take place on Friday. But Nivar stopped the wedding
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X