దారుణం: మహిళపై గ్యాంగ్‌రేప్, వీడియో తీసి...
గుంటూరు: జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై అత్యాచారం చేసిన దుండగులు ఆ దృశ్యాన్ని వీడియో తీసి అతని స్నేహితులకు పంపించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడులో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం అంకమ్మరావు, మహేంద్రలు ఒక వివాహితను అత్యాచారం చేసి, ఆ దృశ్యాన్ని వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోని బ్లూటూత్ ద్వారా ఊర్లో వారందరితో పంచుకున్నారు. ఈ క్రమంలో విషయం తెలిసిన బాధితురాలు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు.

ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
అనంతపురం: జిల్లాలోని కదిరి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు ఈత రాక కుంటలో పడి మృతి చెందారు. కదిరి పట్టణంలో ఐదో తరగతి చదువుతున్న కిరణ్‌కుమార్(11), లోకేష్‌నాయక్ (11)లు ఇద్దరు స్నేహితులు. వారిద్దరూ బుధవారం ఈతకు వెళ్లి కుంటలో పడి మృతి చెందారు.
ఆటకు వెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీంతో వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టణంలోని కుంట వద్ద ఉన్న పిల్లల దుస్తుల ఆధారంగా వారిని గుర్తించారు. బాలురకు ఈత రాకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కుంటలో నుంచి బాలుర మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications