• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పెళ్లి పేరుతో మాజీ ఎమ్మెల్యే కూతుర్ని లోబర్చుకున్న ఏసీపీ: డీజీపీకి ఫిర్యాదు

|

హైదరాబాద్: ప్రజల రక్షణ కల్పించాల్సిన విభాగంలో ఉన్నతాధికారిగా పని చేస్తూ కీచకుడిలా ప్రవర్తించాడొ ప్రబుద్ధుడు. ఓ దళిత యువతికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. వివాహం చేసుకుంటానని చెప్పి శరీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత మోహం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. నిందితుడికి ఓ మంత్రి అండదండలున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పాయకరావుపేట నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే కాకర్ల నూకరాజు కుమార్తె పద్మలత మార్చి19న డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన మధురవాడ ఏసీపీ దాసరి రవిబాబు నుంచి రక్షణ కల్పించాలని కోరారు. అయితే డీజీపీ సానుకూలంగా స్పందిస్తూ శాంతిభద్రతల అదనపు డీజీకి ఈ అంశాన్ని అప్పగించారు.

అదనపు డీజీ వినతిపత్రాన్ని పరిశీలించడమే కాకుండా పద్మలత వాదనలో వాస్తవం ఉందని గ్రహించి ఆ వినతిపత్రంపైనే విశాఖపట్నం పోలీసు కమిషనర్‌కు ఎండార్స్ చేసి ఏసీపీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, అక్కడి మంత్రి ఒకరు జోక్యం చేసుకుని ఏసీపీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సూచించడంతో విశాఖపట్నం పోలీసు కమిషనర్ మిన్నకుండిపోయారనే ఆరోపణలున్నాయి. దీంతో పద్మలత ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

కాగా, బాధితురాలి వినతిపత్రంలోని అంశాలు ఇలా ఉన్నాయి.. గతంలో ఎంపీపీగా పనిచేసిన సమయంలో కొన్ని రాజకీయ గొడవల కారణంగా యలమంచిలి సీఐగా ఉన్న రవిబాబును కలవాల్సి వచ్చిందని పద్మలత తెలిపారు. ఆ సమయంలో యలమంచిలి కోర్టు దగ్గరున్న గెస్ట్ హౌజ్‌కు తనను పిలిపించుకుని కేసుల పేరుతో భయపెట్టి శారీరకంగా రవిబాబు లోబర్చుకున్నారని, అప్పటి నుంచి రవిబాబుతో సాన్నిహిత్యం పెరిగిందని వివరించారు.

A woman allegedly sexually harassed by ACP

తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పి భర్తకు విడాకులు ఇప్పించారని తెలిపారు. అనంతరం భార్యగా స్వీకరించకుండా సాకులు చెబుతూ వచ్చారని.. ఆ తర్వాత అప్పట్లో ఎంపీగా ఉన్న, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పప్పల చలపతిరావు సమక్షంలో రవిబాబు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారని చెప్పారు.

అప్పటి విశాఖజిల్లా డీఐజీ జితేంద్ర, రూరల్ ఎస్పీ మురళికి కూడా ఈ విషయాలన్నీ తెలుసని చెప్పారు. ఇప్పుడు రవిబాబు ఏసీపీ కావడంతో కొందరు పెద్దలను అడ్డంపెట్టుకుని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారని బాధితురాలు తెలిపారు.

'నేను ఇప్పుడు ఏసీపీని.. ఏమి చేసుకుంటావో చేసుకో.. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు' అంటూ గొంతు నొక్కుతున్నాడని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై దర్యాప్తు చేసి ఏసీపీ రవిబాబు చేత భార్యగా స్వీకరింప చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే బిడ్డకు తండ్రిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రాణహాని లేకుండా రక్షణ కల్పించాలని విన్నవించారు.

శాంతి భద్రతల అదనపు డీజీ ఆమెకు ధైర్యం చెప్పడమే కాకుండా విశాఖ కమిషర్ మాట్లాడాల్సిందిగా ఫోన్ నెంబర్ కూడా పద్మలతకు ఇచ్చారు. దీంతో పద్మలత కమిషనర్‌కు ఫోన్ చేయగా రక్షణ కల్పించే విషయంపై ప్రస్తావించకుండా 'మీరు ఎక్కడున్నారంటూ' ఆరాలు తీయడం మొదలుపెట్టారు. దీంతో ప్రాణభయం ఉందని భావించిన ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని బాధితురాలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman allegedly sexually harassed by ACP in Visakhaptam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more