వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధార్ కోసం క్యూలో పిల్లా పాపలతో (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ కోసం ఇంకా ప్రజలకు కష్టాలకు తప్పడం లేదు. ప్రభుత్వ పథకాలను ఆధార్‌కి అనుసంధానం చేస్తూ తుది గడువు దగ్గర పడుతుండటంతో తెల్లవారుజాము నుండే ఆధార్ నమోదు కేంద్రాల వద్ద ప్రజలు పిల్లా పాపలతో బారులు తీరుతున్నారు.

ద్వారకానగర్‌లోని కార్వే కార్యలయం వద్ద బుధవారం ఉదయం ఆధార్ నమోదు కోసం జనం ఎగబడ్డారు. సంస్ద కార్యాలయం నుండి బుధిల్ పార్క్ రోడ్ వరకు క్యూలో చాలా సేపు పడిగాపులు కాశారు. వారిని అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. విశాఖపట్నంలో నమోదు చేసుకుంటే త్వరగా ఆధార్ కార్డు వస్తుందని అరకు ప్రాంతం నుండి 38 మంది గిరిజనులు బుధవారం ఇక్కడికి వచ్చారు.

గడుపులోగా ఆధార్ సమర్పించకుంటే ఎక్కడ ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని లభ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.

అరకు నుండి వచ్చాం: సుమని

అరకు నుండి వచ్చాం: సుమని

ఆధార్ కార్డు కోసం తెల్లవారుజామున అరకు నుండి వచ్చాం. మా ఊరిలో ఐతే చాలా ఆలస్యం అవుతుంది. టౌన్‌లో వేగంగా ఇస్తారని తెలిసి చిన్న పిల్లలతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే పెద్ద లైన్ ఉంది. టోకెన్ తీసుకోని మళ్లీ రావాలంటా అని సుమని చెప్పారు.

70 వయసులో ఆధార్ కోసం

70 వయసులో ఆధార్ కోసం

నా వయసు 75 సంవత్సరాలు, వృధ్దాప్య పింఛన్ కోసం ఆధార్ అవసరం అంటున్నారు. ఉదయం నుండి క్యూలో నిలబడి ఉన్నాను. నాలాగ వయసు మీద పైబడిన వారికి ఆధార్ నమోదులో వెసలుబాటు కల్పిస్తే బాగుంటుందని మర్రిపాలానికి చెందిన పైడమ్మ అన్నారు.

ఆధార్ కోసం రెండు సార్లు దరఖాస్తు చేశాను

ఆధార్ కోసం రెండు సార్లు దరఖాస్తు చేశాను

ఆధార్ కార్డు కోసం గాజువాకంలో రెండు సార్లు దరఖాస్తు చేశాను. నాకు, నా భార్యకు ఆధార్ వచ్చింది. నా కొడుక్కి రాలేదు. అందుకని ఉదయాన్నే ఇక్కడకి వచ్చాను. ఈ రోజు నా పని, మా అబ్బాయి స్కూల్ రెండూ మానుకోవాల్సిన పరిస్దితి వచ్చిందని గాజువాకకి చెందిన కార్పెంటర్ అన్నారు.

 70 వయసులో ఆధార్ కోసం

70 వయసులో ఆధార్ కోసం

నా వయసు 75 సంవత్సరాలు, వృధ్దాప్య పింఛన్ కోసం ఆధార్ అవసరం అంటున్నారు. ఉదయం నుండి క్యూలో నిలబడి ఉన్నాను. నాలాగ వయసు మీద పైబడిన వారికి ఆధార్ నమోదులో వెసలుబాటు కల్పిస్తే బాగుంటుందని మర్రిపాలానికి చెందిన పైడమ్మ అన్నారు.

English summary
Adhaar enrollment is proving to be a serious difficulty for people of dwaraka nagar, visakapatnam. They are returning empty handed even after waiting for several hours while company staff members are blaming BLO to hide their lapses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X