వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీ జాబితాలోకి కరోనా..

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ జాబితాలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులను ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా చేర్చుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. కరోనాకు సంబంధించి 15 రకాల ప్రొసీజర్స్‌ను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేర్చింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనా కేసులను తీసుకోవాలని ఆదేశించింది.

కరోనా అనుమానిత లక్షణాలు, నిర్థారణ, ఇతర వ్యాధులతో కలిపి వైద్యానికి ధరల ప్యాకేజీని నిర్థారించింది. కనీసం రూ. 16 వేల నుంచి గరిష్టంగా రూ.2.16 లక్షలుగా ధరను నిర్ణయించింది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోనే కరోనా పేషెంట్లను ఆసుపత్రుల్లో చేర్చుకోవడంతో పాటు చికిత్సకు ఆదేశాలు జారీ చేసింది.

aarogyasri-to-cover-coronavirus-private-hospitals-also-treat-for-it

Recommended Video

AP CM Jagan, CM KCR And Chandrababu Naidu Light Candles, Diyas

ఇక రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ మొత్తం కేసులు 303కు చేరుకున్నాయి. సోమవారం(ఏప్రిల్ 6) ఒక్కరోజే 37 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కర్నూలులో-18, నెల్లూరు-8, పశ్చిమ గోదావరి-5, కడప-4, కృష్ణా-1, ప్రకాశంలో ఒక పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు-42, గుంటూరు-32, కృష్ణా-29, కడప-27, ప్రకాశం-24, విశాఖ-20, చిత్తూరు-17, పశ్చిమ గోదావరి-21, తూర్పు గోదావరి-11, అనంతపురం-6 కేసులు నమోదయ్యాయి.

English summary
AP CM YS Jagan Mohan Reddy issued a G.O to cover coronavirus treatment under Aarogya Sri scheme. So that government given permission to private hospitals to treat coronavirus cases
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X