వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండలి రద్దుపై వైసీపీకి కేంద్రం ఝలక్-పరిశీలనలో ఉందని క్లారిటీ-జగన్ కిం కర్తవ్యం ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో మూడు రాజధానుల బిల్లుల్ని ఆమోదించలేదని కారణంతో శాసనమండలిని రద్దు చేస్తూ వైసీపీ సర్కార్ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ ఏడాది జనవరిలోనే పంపిన ఆ తీర్మానంపై కేంద్రం ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. ఆ లోపు మండలి రద్దు కోరిన వైసీపీ.. ఏమీ తెలియనట్లుగా ఎమ్మెల్సీను ఎంపిక చేసి మండలికి పంపుతోంది. దీంతో ఈ వ్యవహారాన్ని కేంద్రం కూడా మర్చిపోయిందని భావిస్తున్న తరుణంలో ఇవాళ ఒక్కసారిగా ఝలక్ ఇచ్చింది.

తెరపైకి ఏపీ శాసనమండలి రద్దు

తెరపైకి ఏపీ శాసనమండలి రద్దు

ఏపీలో మూడు రాజధానుల బిల్లుల్ని అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్న వైసీపీ సర్కార్.. మండలిలోనూ వాటి ఆమోదం కోసం ప్రయత్నించింది. అయితే టీడీపీ మెజారిటీ ఉన్న మండలి వీటిని ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపింది. మరోసారి బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో వైసీపీ సర్కార్ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇవాళ పార్లమెంటులో మరోసారి ఈ వ్యవహారం చర్చకు వచ్చింది.

టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్న

టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్న


ఏపీలో శాసనమండలి రద్దు కోసం వైసీపీ సర్కార్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన నేపథ్యంలో ఆ వ్యవహారం ఎంత వరకూ వచ్చిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఇవాళ రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ ఏడాది జనవరిలో ఏపీ ప్రభుత్వం పంపిన విజ్ఞప్తిపై కేంద్రం స్పందించి ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని కోరారు. అసలు మండలి రద్దు ప్రక్రియ మొదలైందా లేదా అని నిలదీశారు. దీంతో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు దీనిపై సమాధానం ఇచ్చారు.

జగన్ సర్కార్ కు కేంద్రం ఝలక్

జగన్ సర్కార్ కు కేంద్రం ఝలక్


ఏపీలో శాసనమండలి రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన వైసీపీ సర్కార్.. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక్లలో మాత్రం అభ్యర్ధులను నిలబెట్టి గెలిపించుకుంది. దీంతో మండలి రద్దుపై వైసీపీకి ఆసక్తి లేదని తేలిపోయింది. అటు కేంద్రం కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని అర్ధమైంది. అయితే ఇవాళ హఠాత్తుగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ప్రశ్నించడంతో కేంద్రం ఇరుకునపడింది. అయితే దీనిపై సమాధానం చెప్పిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు... ఆ విషయం కేంద్రం పరిశీలనలోనే ఉందని స్పష్టం చేశారు. కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీంతో వైసీపీ సర్కార్ ఇరుకునపడింది.

జగన్ నిర్ణయంపై ఆసక్తి

జగన్ నిర్ణయంపై ఆసక్తి


మండలి రద్దు కోసం ఈ ఏడాది జనవరిలోనే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన తర్వాత జరిగిన ప్రతీ మండలి ఎన్నికల్లోనూ వైసీపీ పాల్గొంది. మండలి రద్దుపై తామే తీర్మానం చేసినా, దానికి విరుద్ధంగా మండలికి తమ సభ్యుల్ని పంపింది. ఇప్పుడు కేంద్రం మండలి రద్దును పరిశీలిస్తున్నట్లు చెప్పడంతో కేంద్రానికి ఏం చెప్పాలో తెలియక వైసీపీ తల పట్టుకుంటోంది. జగన్ త్వరలో ఢిల్లీ టూర్ కు వెళ్లనున్న నేపథ్యంలో అక్కడ కేంద్ర పెద్దలకు దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశముంది. జగన్ సర్కార్ వద్దని కోరితే మాత్రం మండలి రద్దు ప్రతిపాదన విరమించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించే వీలుంటుంది.

English summary
the union government on today clarified that abolition of andhrapradesh legislative council is still under consideration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X