వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపిలో రూ.5 భోజనం క్యాంటీన్లు మూసివేత దిశగా...

|
Google Oneindia TeluguNews

ఏపీలో గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడవిడిగా , తాత్కలిక షెడ్లలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు మూతపడుతున్నాయి. సరైన వసతి లేకపోవడంతో ప్రభుత్వం నుండి రావల్సిన బకాయిలు సకాలంలో అందకపోవడంతో మండల కేంద్రాల్లోని, తాత్కలిక షెడ్లలో ఏర్పాటు చేసి సుమారు 50 అన్నా క్యాంటీన్లు మూసివేత దిశగా పయనిస్తున్నాయి.

రాష్ట్ట్రంలో రూ. 5 భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన తాత్కలిక అన్నా క్యాంటీన్లు ఒక్కోక్కటిగా మూత పడుతున్నాయి. అయితే గత ప్రభుత్వం మొత్తం 200పైగా ఈ క్యాంటీన్లను ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకుని వాటిని పట్టణ ప్రాంతాల్లో పక్క ప్రణాళికతో ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల నేపథ్యంలో వివిధ మండల కేంద్రాల్లో సైతం వీటికోసం డిమాండ్ పెరిగింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే విజ్జప్తి మేరకు సుమారు 50 వరకు మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం ప్రారంభించింది.

About 50 Anna canteens are moving towards closure in the ap

అయితే ఇప్పుడు వాటికి సరైన ప్రణాళిక లేకుండా ప్రారంభించడంతోపాటు సరైన వసతి కూడ లేకపోవడంతో పాటు ప్రభుత్వం నుండి రావల్సిన బకాయిలు రావడం లేదు. ఈ క్యాంటిన్ల కోసం అహారం సరఫరా చేస్తున్న అక్షయ పాత్రకు కొంత అర్ధిక నిధులు సమకూర్చే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బడి ముబ్బడిగా తాత్కాలిక షెడ్లలో ఏర్పాటు చేసిన క్యాంటీన్లను మూసి వేస్తున్నట్టు అధికార వర్గాలు ప్రకటించాయి. అయితే శాశ్వత భవనాల్లో కొనసాగుతున్న క్యాంటిన్లు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి.

English summary
About 50 Anna canteens are moving towards closure in the ap which previous government was started in temporary sheds. they are shattering due to lack of accommodation adequate money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X