వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముహూర్తాల్లేవు మరి.. ఏపీలో 23 - 25 మధ్య వివాహాలు లక్షకు పైనే

వచ్చే ఏడాది మార్చి వరకు మంచి ముహూర్తాల్లేవు. లగ్నశుద్ధి కల ముహూర్తాలు కావడంతో ఈ నెల 23, 24, 25 తేదీల్లో భారీగా వివాహాలు జరుగనున్నాయి. పెళ్లిళ్లు ఒకేసారి బుక్ కావడంతో వివాహ మండపాలతోపాటు ఫొటో ఆల్బం మొదల

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెళ్లి ముహూర్తాలు ముంచుకు వస్తున్నాయి. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. పురోహితులు దొరకడం లేదు. పెళ్లి మండపాలు ఖాళీగా లేవు. బ్యాండ్‌ మేళం, మ్యారేజీ డెకరేషన్‌ వాళ్లకు ఫుల్ గిరాకీ ఉంది! ఇక ఆలయాల్లో అయితే వధూవరులు తప్ప మరో వ్యక్తి కాలుమోపేందుకు కూడా వీలుదొరకదన్నట్లు పేర్లు నమోదు అవుతున్నాయి. ఒకటా రెండా.. 23, 24, 25 తేదీల్లో లక్షకు పైగా వివాహలు జరుగుతుండటంతో పెళ్లి పెద్దల్లో గుబులు పట్టుకున్నది. ఒక నెలలో మూడు మంచి రోజుల్లో ఇంత భారీ సంఖ్యలో వివాహాలు జరగడం ఇదే ప్రథమం అని పురోహితులు అంటున్నారు. హేవళంబి నామ తెలుగు సంవత్సరంలో మూఢాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ వరకు శుక్రమౌఢ్యమి ఉండటంతో ఈ సమయంలో పెళ్ళిళ్లు, తదితర శుభకార్యాలు చేయకూడదని పండితులు అంటున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఇప్పటివరకు మూఢాల వల్ల, మంచి ముహూర్తాలు లేక వివాహాలు తక్కువ సంఖ్యలో జరిగాయి. ఈ నెల 23, 24, 25 తేదీలు తప్పితే మళ్లీ వచ్చే ఏడాది మార్చిలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఈ మూడు రోజుల్లో లక్షకు పైగా పెళ్లిళ్లు జరగనున్నాయని పేర్కొంటున్నారు.

గుంటూరు, బెజవాడల్లో 25 వేల ముహూర్తాలు

గుంటూరు, బెజవాడల్లో 25 వేల ముహూర్తాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు సగటున 10 వేల వివాహాలు జరగనున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోనే 25వేల ముహూర్తాలు కుదిరినట్లు చెప్తున్నారు. పెద్ద సంఖ్యలో ముహూర్తాలు ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా కల్యాణ మండపాలన్నీ ముందే బుక్‌ అయ్యాయి. ఆ మూడ్రోజుల్లో ఖాళీగా ఉన్న కల్యాణమండపం ఒక్కటి కూడా లేదని అంటున్నారు. చివరకు ఆలయాల్లోనూ కిటకిటే. ఇక పురోహితులతో పాటు కేటరింగ్‌, వంట పనివారు, లైటింగ్‌, అలంకరణ, బ్యాండ్‌, పూలు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు తెగ డిమాండ్‌ పెరిగింది. కష్టపడి ఆ మూడ్రోజుల్లో ముహూర్తాలు ఖరారు చేసుకుంటే.. వీరు దొరకడం కష్టతరంగా మారింది. సమయం సర్దుబాటు చేసుకోవాలని ఒప్పించడం పెద్ద సమస్యగా మారింది.

సగటున ప్రతి పంక్షన్ హాలులో 1000 వివాహాలు

సగటున ప్రతి పంక్షన్ హాలులో 1000 వివాహాలు

హేవళంబి నామ సంవత్సరంలో ఈ నెలలోనే అత్యంత బలమైన వివాహ ముహూర్తాలు వచ్చాయి. ఈ ఏడాదికివే చివరి ముహూర్తాలు. ఈ ఏడాది గురుమౌఢ్యమి ఈ నెల 9వ తేదీతో ముగిసింది. ఈ నెల 28వ తేదీ నుంచి శుక్రమూఢమి ప్రారంభమై వచ్చే ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో ఈ నెలలోనే పెళ్లిళ్లు ఖరారు చేసుకున్నారు. ఒక్క విజయవాడలోనే మూడు రోజుల్లో సగటున రోజుకు 1000 వివాహాలు జరగనున్నట్లు అంచనా. కల్యాణమండపాలు, ఇతరత్రా ఫంక్షన్‌ హాళ్లు కూడా ఖాళీ లేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ ఇండ్లు ముందే వివాహా వేడుకలు జరిపేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రధాన ఆలయాల్లో రోజుకు 100 నుంచి 150 వివాహాలు జరగనున్నట్లు తెలిసింది.

డెకరేషన్లకు, విద్యుద్దీకరణకు భారీగా ఖర్చు

డెకరేషన్లకు, విద్యుద్దీకరణకు భారీగా ఖర్చు

స్టయిలిష్‌గా అంటే సొంత కార్లు ఉన్న పురోహితులు వివాహం జరిపించినందుకు రూ.లక్ష, ఆ పైన మోతుబరుల నుంచి పారితోషికం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఆదాయం పన్నుశాఖ నిర్వహించిన ఒక సెమినార్‌లో బెజవాడ నగర పెద్దలు కొందరు ఈ విషయాన్ని చెప్పడం విశేషం. సాధారణ పురోహితులు రూ.25 నుంచి రూ 50 వేల వరకు రుసుము తీసుకుంటున్నారు. డబ్బుతో పాటు వివాహాలలో వినియోగించే కొన్ని వస్తువులను పురోహితులు, వారి సహాయకులే తీసుకుంటారు. మండపాల డెకరేటర్లలో డిజైన్లను బట్టి రూ.25 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు కేవలం మండపం వద్ద స్టేజ్‌ నిర్మాణానికే వ్యయం చేయాల్సి వస్తోంది. మరోవైపు విద్యుద్దీపాల అలంకరణకు కూడా భారీ వ్యయం అవుతోంది.

బెజవాడ, గుంటూరుల్లో హోటళ్లు ముందే బుక్

బెజవాడ, గుంటూరుల్లో హోటళ్లు ముందే బుక్

కేటరింగ్‌ ధరలు భారీగా పెరిగాయి. స్వయంగా వండించడం వ్యయ, ప్రయాసలతో కూడుకున్నది. పైగా గతంలో మాదిరిగా పెద్దలు దగ్గర ఉండి వంటలు, భోజనాల నిర్వహణ చేసేవారు లేకపోవడంతో కేటరింగ్‌లకు అప్పగిస్తున్నారు. కేటరింగ్‌లో మెనూ.. ప్లేటుకింత అని రేట్ ముందే నిర్ణయిస్తారు. వచ్చే ఆహుతులను బట్టి అన్ని ప్లేట్లకు ఇంత చొప్పున వసూలు చేస్తారు. సాధారణ వంటకాలకే ప్లేట్ భోజనానికి రూ.300 వంతున తీసుకుంటున్నట్లు సమాచారం. అదే ప్రత్యేక వంటలు, తదతర అదనపు వంటకాలు, కూరలు, పొడులు అదనంగా వడ్డించాలంటే రూ.450 పై మాటే వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వివాహాల నిర్వాహకులు విజయవాడ, గంటూరు హోటళ్లు ముందే బుక్‌ చేసుకోవడంతో గదులు ఖాళీగా లేవు.

గాజులు, నెక్లెస్‌లకు గిరాకీ

గాజులు, నెక్లెస్‌లకు గిరాకీ

బంగారు నగల కొనుగోళ్లు భారీగా కాకపోయినా వ్యాపారం పర్వాలేదని వర్తకులు చెబుతున్నారు. గాజుల జత రూ.75 వేల నుంచి, లక్షన్నర వరకు ధర ఉంటే, మిగతా హారాలు బరువును బట్టి రూ.లక్షన్నర నుంచి 5 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. రూ.50 వేలకు మించి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నట్లు వ్యాపారులు అంటున్నారు. ఉంగరాలు, గాజులు, నెక్లెస్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండగా, వడ్డాణం వంటి వాటికి తక్కువ గిరాకీ ఉందని చెబుతున్నారు.

భారీగా పెరిగిన కల్యాణ మండపాల ధరలు

భారీగా పెరిగిన కల్యాణ మండపాల ధరలు

23వ తేదీన పంచమితోపాటు గురువారం ఉత్తరాషాడ నక్షత్రం.. సింహలగ్నం.. 24వ తేదీ..షష్టి.. శుక్ర వారం.. శ్రవణ నక్షత్రం.. సింహలగ్నం.. 25వ తేదీ.. సప్తమి.. శనివారం.. ధనిష్ట.. మేష లగ్నంఈ మూడు ముహూర్తాలు చాలా బలమైనవని పంచాంగకర్తలు చెబుతున్నారు. లగ్నశుద్ధిగల ముహూర్తాలు కావడంతోపాటు సమీపంలోని మరో మూడు నెలల వరకూ ముహూర్తాలు లేక వీటికే మొగ్గు చూపారు. ఇటీవల కల్యాణమండపాల అద్దెలు భారీగా పెరిగాయి. జీఎస్టీ పేరుతో 20 శాతం మేరకు అద్దెలు పెంచారు. ఆలయాల్లోని మండపాల్లో. ఖాళీ స్థలాల్లో ఇదివరకు ఒక పూటంతా అద్దెకు ఇచ్చేవారు. ఇప్పుడు 3-4 గంటలకే ఓ పూట అద్దె మొత్తం వసూలు చేస్తున్నారు. ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఈ మూడ్రోజుల్లో ముహూర్తాలకు రేట్లు భారీగా పెంచేశారు. ఇంతకముందు వధూవరుల ఫొటోల ఆల్బమ్‌, వీడియో ఇచ్చేందుకు దాదాపు రూ 50 నుంచి 60 వేలు ఉంటే ఇప్పుడు రూ.లక్ష వరకు పెంచేశారు.

English summary
This month 23rd to 25th that three days have muhurthams for marriages in Andhra Pradesh. In this context they are above one lakh marriages here. As average in district to organise 10 thousand marriages. Marriage halls are pre planned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X