వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసు వేస్తా: అమృత వర్షిణి హెచ్చరిక, తెలంగాణ ప్రభుత్వ ఆఫర్‌కు నో!

|
Google Oneindia TeluguNews

మిర్యాలగూడ: ప్రణయ్ కేసులో ఓవైపు హత్యను వ్యతిరేకిస్తూనే.. తల్లిదండ్రుల ప్రేమ, ముఖ్యంగా 14 ఏళ్లు, 15 ఏళ్ల వయస్సులో ప్రేమ గురించి విమర్శలు వస్తున్నాయి. అంత చిన్న వయస్సులో ప్రేమ, పెళ్లి ఏమిటంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై అమృత వర్షిణి స్పందించారు. అంతేకాదు, తనకు ప్రభుత్వం ప్రకటించిన వాటిని కూడా తిరస్కరిస్తున్నారు.

Recommended Video

ప్రణయ్‌ కుంటుంబ సభ్యులను కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శ

అమృత తల్లిదండ్రుల ఆస్తి వందల కోట్లలో ఉంటుంది. ప్రణయ్ ఆస్తి కూడా పది నుంచి ఇరవై ముప్పై కోట్ల వరకు ఉంటుందనే వాదన ఉంది. మొన్న కొండగట్టులో 60మంది చనిపోతే రాజకీయ నాయకులు చాలామంది వారి వద్దకు వెళ్లలేదని, వారికి ఏ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదని సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

అమృత వద్దకు నేతల క్యూ, ఆఫర్లు: ఏం సహకారం కావాలని కలెక్టర్ అడగ్గా..అమృత వద్దకు నేతల క్యూ, ఆఫర్లు: ఏం సహకారం కావాలని కలెక్టర్ అడగ్గా..

 సోషల్ మీడియాలో ట్రోల్స్

సోషల్ మీడియాలో ట్రోల్స్

కానీ ఇప్పుడు అమృత వద్దకు రాజకీయ నాయకులు క్యూ కడుతున్నారని ట్రోల్స్ వస్తున్నాయి. రూ.8 లక్షలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఐదు ఎకరాల భూమి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికులు చనిపోతే కూడా రాజకీయ నాయకులు ఇలా స్పందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వం తనకు ఇస్తానన్న వాటిని అమృత తిరస్కరిస్తున్నారు.

నేనేం అడగలేదు, ఫిర్యాదు చేస్తా

నేనేం అడగలేదు, ఫిర్యాదు చేస్తా

నేను ప్రభుత్వం నుంచి డబ్బులు అడగలేదని, డబుల్ బెడ్రూం అడగడం లేదని, ఎమ్మెల్యే టిక్కెట్ కూడా అడగడం లేదని, కేవలం ప్రణయ్ విషయంలో న్యాయం అడుగుతున్నానని ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారట. అంతేకాదు, తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

అవమానించేలా పోస్టులు పెడితే

అవమానించేలా పోస్టులు పెడితే

సోషల్ మీడియాలో తనను అవమానించేలా పోస్టులు పెడితే కేసులు పెడతానని అమృత హెచ్చరించారు. తనను అవమానించేలా పోస్ట్‌లు పెట్టేవారిపై కోర్టులో కేసులు వేస్తానని హెచ్చరించారు. ఈ సమస్యను రెండు కులాలకు చెందిన అంశంగా చెప్పడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు.

ప్రణయ్ తండ్రి

ప్రణయ్ తండ్రి

ప్రణయ్ తండ్రి బాలస్వామి మాట్లాడుతూ... దేవుడి దయతో తమకు కావాల్సినంత డబ్బు ఉందని, కానీ ఈ కేసులో నిందితులకు తగిన శిక్ష పడాలనేదే తమ డిమాండ్ అని, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, అన్ని ఆధారాలు లభ్యమయ్యాయని, నిందితులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవద్దన్నారు.

విగ్రహం వద్దంటూ

విగ్రహం వద్దంటూ

మరోవైపు, ప్రణయ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దంటూ స్థానికంగా కొందరు ఓ అడ్వకేట్‌ ఆధ్వర్యంలో డీఎస్పీ, మున్సిపల్‌, ఎమ్మెల్యే కార్యాలయాల్లో వినతిపత్రాలు అందచేస్తున్నారని తెలుస్తోంది. ప్రణయ్ విగ్రహాన్ని పెడితే నగరంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని, కులాల మధ్య చిచ్చు రేగుతుందని చెబుతున్నారని తెలుస్తోంది.

English summary
Two days after the Telangana state government announced the compensation of Rs 8 lakh, a double bedroom house, five acres land to the widow of the slain P. Pranay Kumar, different opinions are popping up on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X