వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోం మంత్రి సుచరితనూ వదలని నెటిజన్ .. అసభ్యంగా పోస్ట్ పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత పట్ల సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అభ్యంతరకరమైన పోస్టు పెట్టటంతో అది కాస్తా వైరల్ గా మారింది . దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ చెందిన ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో మంత్రి సుచరితపై అసభ్యకరమైన పోస్టు పెట్టాడు. చెప్పలేని విధంగా, రాయకూడని భాషలో పరుష పదజాలంతో ఆమెను ఆ పోస్ట్ లో దూషించాడు. ఈ పోస్టు వైరల్‌గా మారడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. ప్రత్యేక దర్యాప్తు చేసి నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

చంద్రబాబే నేటికీ మా సీఎం .. అందుకే సీఎం చంద్రబాబు అనే సంబోధిస్తున్నా అన్న గల్లా అరుణచంద్రబాబే నేటికీ మా సీఎం .. అందుకే సీఎం చంద్రబాబు అనే సంబోధిస్తున్నా అన్న గల్లా అరుణ

నేరం జరిగిన ప్రతీచోటా కాపలా ఉండలేమన్న మంత్రి సుచరిత వ్యాఖ్యలపై అసభ్యకర పోస్ట్ పెట్టిన నెటిజన్ .. డీజీపీకి ఫిర్యాదు

నేరం జరిగిన ప్రతీచోటా కాపలా ఉండలేమన్న మంత్రి సుచరిత వ్యాఖ్యలపై అసభ్యకర పోస్ట్ పెట్టిన నెటిజన్ .. డీజీపీకి ఫిర్యాదు

నేరం జరిగిన ప్రతీచోటా కాపలా ఉండలేమని హోం మంత్రి సుచరిత చేసిన వ్యాఖ్యలపై విశాఖపట్నంకు చెందిన రాం మహారాజ్ అనే వ్యక్తి అసభ్యకర పోస్టింగ్ లు పెట్టారు. చాలా అభ్యంతరకరంగా ఆమె గురించి రాశారు. ఇక పోస్ట్ లపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి సుచరితను ఉద్దేశించి అగౌరవంగా, అసభ్యకరంగా పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అశోక్‌ కుమార్‌ అనే వ్యక్తి రెండు రోజుల కిందట ఫిర్యాదు చేశారు.

రామ్ మహారాజ్ అనే వ్యక్తి పోస్ట్ చేసినట్టు ఫిర్యాదు .. దర్యాప్తు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు

రామ్ మహారాజ్ అనే వ్యక్తి పోస్ట్ చేసినట్టు ఫిర్యాదు .. దర్యాప్తు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు

రామ్‌ మహారాజ్‌ అనే ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఈ పోస్టు పెట్టినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గుంటూరు పట్టాభిపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు ఆదేశించారు. దర్యాప్తు చేసిన పోలీసులుఅసభ్యకర పోస్టింగ్ లు పెట్టిన వ్యక్తి రాం మహారాజ్ అనే వ్యక్తి అని గుర్తించి గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొత్తపట్నంకు చెందిన రామ్ మహారాజ్ గా గుర్తించిన పోలీసులు అతనే మంత్రి సుచరితపై అసభ్య పోస్ట్‌ పెట్టినట్టు పోలీసులు నిర్ధారించారు.

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు

గుంటూరు అర్బన్‌ ఎస్పీ పర్యవేక్షణలో డీఎస్పీ కులశేఖర్‌, సీఐ కల్యాణ రాజు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఒక ప్రజాప్రతినిధి అందులోనూ మహిళపై అసభ్యకర పోస్టింగ్ లు పెట్టినందుకు పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. అలాగే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నిందితుడిని రిమాండ్ కు తరలించారని సమాచారం . అయితే ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు పోలీసులు.

English summary
An objectionable post on social media on Andhra Pradesh Home Minister Mekatoti Sucharitha which has become some what viral. The man was arrested by the police. A young man from Visakha posted a derogatory post on Minister Sucharitha on Facebook. Unexpectedly, she was slandered in the post by a rude vocabulary in a abusive language .The post has become a topic of debate as it has gone viral. The police have taken the matter seriously and made a special investigation and arrested the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X