కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎసిబి వలలో అవినీతి అధికారులు:కడపలో ఇంజనీర్...గుంటూరులో ఎస్ఐ అరెస్ట్

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

కడప,గుంటూరు:రాష్ట్రంలో ఎసిబి అధికారులు ఒకే రోజు ఇద్దరు అవినీతి అధికారుల ఆట కట్టించారు. ఈ ఇద్దరు అధికారులు బాధితుల నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం గమనార్హం.

కడపలో బిల్లుల చెల్లింపు కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేసిన పంచాయతీ రాజ్‌ శాఖ ఇంజనీర్ ఎసిబికి చిక్కగా...గుంటూరులో ఒక కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఒక వ్యక్తి నుంచి రూ. 1 లక్ష లంచం డిమాండ్ చేసిన ఎస్ ఐను అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే...

ACB arrests two officials for accepting bribe in separate cases in AP

చాపాడు మండలం పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి రహింతుల్లా నాదులపల్లి, ఉప్పరపల్లి రహదారి పనుల బిల్లులు మంజూరు చేసేందుకు గాను కాంట్రాక్టర్ ను లంచం కోసం డిమాండ్ చేశారు. రూ. 10 లక్షల రూపాయల వ్యయంతో ప్రొద్దుటూరుకు చెందిన కాంట్రాక్టర్‌ రామాంజనేయరెడ్డి ఈ రెండు పనులు పూర్తి చేయగా వాటి బిల్లుల చెల్లింపునకు గాను ఇంజనీరింగ్ అధికారి రహింతుల్లా 14వేలు డిమాండ్‌ చేశారు. ఈమేరకు ప్రొద్దుటూరుకు చెందిన కాంట్రాక్టర్‌ ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎసిబి సూచనలను అనుసరించి బాధితుడు నడుచుకోగా జిల్లా పరిషత్‌ ప్రాంగణంలో ఇఇ కార్యాలయ సమీపంలో అంచం తీసుకుంటున్న రహింతుల్లా ను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేయబడిన 333/2017 కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులు అందరినీ అరెస్ట్ చేయకుండా ఉండాలంటే లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని పాత గుంటూరు ఎస్ఐ జె.వెంకట నరసింహారావు నిందితుడిని డిమాండ్ చేశాడు. దీంతో నిందితుడు
ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఒక జ్యూస్ స్టాల్ లో ఫిర్యాదుదారుడి నుంచి ఎస్ లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

మరోవైపు విజయవాడలోని ఆటోనగర్‌ అగ్నిమాపక శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస రావు తన కార్యాలయంలో విజయదుర్గ పెట్రో కెమికల్స్‌ యజమాని ముద్దాడ రామకృష్ణ నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డాడు. ఇటీవల విజయదుర్గ పెట్రో కెమికల్స్‌ కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కర్మాగారంలోని విద్యుత్‌ మీటర్‌ దగ్ధమైంది. ఈ మీటర్‌ ను సర్టిఫై చేసేందుకు శ్రీనివాసరావు లంచం డిమాండ్‌ చేసినట్లు ఎసిబి విచారణలో తేలింది. ఈ మేరకు నగదు స్వాధీనం చేసుకుని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

English summary
Kadapa,Guntur: The sleuths of Andhra Pradesh Anti-Corruption Bureau (ACB) continued its drive against government servants involved in corruption on wednesday. The ACB sleuths conducted a 'trap operation' at ZP office in Kadapa and arrested a SI for accepting bribe of Rs 1 Lakh from a accused man in Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X