నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో ఏసీబీ దాడులు.. ఎమ్మార్వో ఆఫీసుల్లో ఉద్యోగులకు వణుకు పుట్టిస్తున్న సోదాలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇప్పుడు ఏసీబీ దాడుల కలకలం రేగింది. ఎమ్మార్వో ఆఫీసులను టార్గెట్ చేసి ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. అవినీతి అధికారుల భరతం పట్టమని, పారదర్శకంగా పనులు జరగాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు వణుకు పుట్టిస్తున్నాయి.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా వడమాల, పుత్తూరు, రేణిగుంట, నగరి తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.విశాఖలోని సబ్బవరం, భీమిలి, విజయనగరం జిల్లాలోని వేపాడు లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. శ్రీకాకుళంలోని కొత్తూరు, కర్నూలులోని కల్లూరు, ప్రకాశంలోని పొన్నలూరు, తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం, పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

ACB attacks in AP .. targeted MRO offices .. employees in tension

అనంతపురంలోని ముదిగుప్ప, కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం తహశీల్దార్ కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు. అలాగే నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేట, కావలిలలో , గుంటూరులోని మాచర్ల, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ ప్రాంతాల్లో ఒకేసారి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఎమ్మార్వో కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది.

English summary
ACB officials are conducting searches at tahsildar offices in several districts of the state. ACB conducts the raids tahsildar offices across the state at a same time . tension in officials with the searches of the ACB officials in their offices .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X