ఏసీబీ చరిత్రలోనే పెద్ద కేసు: అవినీతి ఇంజినీర్‌పై ఏసీబీ విస్మయం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్ గంగాధరం కేసు ఏసీబీ చరిత్రలోనే పెద్దదని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. పది కోట్లకు పైగా ఆస్తులు సీజ్ చేశామని తెలిపారు. ఈ కేసుపై హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులు మీడియాతో మాట్లాడారు.
ఈ కేసు ప్రత్యేకమైన కేసని, ఓ ప్రభుత్వోద్యోగి షెల్ కంపెనీలలో భాగస్వామి కావడం ఇదే తొలిసారని అన్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని వారు వెల్లడించారు. ఆయన శాలరీ అకౌంట్లో 21లక్షల రూపాయలు గుర్తించామని తెలిపారు. ఐమ్యాజిక్స్ మెలాసిస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న కంపెనీలో 24లక్షల రూపాయలు, ఇతర కుటుంబసభ్యుల ఖాతాల్లో లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పారు.

ఇలా కేవలం నగదునే రూ. 50లక్షల వరకు సీజ్ చేశామని అధికారులు తెలిపారు. అతని లాకర్లలో పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వాటిని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు.
షెల్ కంపెనీల్లో ఆయన పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోందిన, వాటన్నింటిపై దర్యాప్తు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా, వందకోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టిన గంగాధరంను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications