వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఏసీబీ భారీ స్కెచ్ :హిట్ లిస్టు రెడీ..ముహూర్తం ఖరారు :ముఖ్యమంత్రి కీలక అదేశాలు ..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో అవినీతిని పూర్తిగా నియంత్రించే చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏసీబీకి స్వేచ్చనిస్తూ..అదే సమయంలో ఏ రకంగానూ..ఎవరు జోక్యం చేసుకున్నా అవినీతి విషయంలో రాజీ పడవద్దని స్పష్టం చేసారు. దీంతో..వచ్చే వారం నుండి ఏపీలో పెద్ద ఎత్తున దాడులను అవినీతి నిరోధక శాఖ రంగం సిద్దం చేసుకుంటోంది. అదనపు సిబ్బందిని సైతం సమకూర్చుకుంటోంది. ఎక్కడ అవినీతి జరిగినా సహించేది లేదనే విషయం ప్రతీ ఒక్కరికి చేరాలని సీఎం నిర్దేశించారు. ఏసీబీ చాలా చురుగ్గా పని చేయబోతోందని స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. దీని ద్వారా కీలక శాఖల్లోని అవినీతి అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు సీఎం జగన్ తాజా ఆదేశాలు..ఏసీబీ వ్యవహారం ప్రభుత్వంలో హాట్ టాపిక్ గా మారింది.

జిల్లాస్థాయిలో యాభైశాతం ఉద్యోగాలు: మహిళలకే డిసెంబర్‌ 15 కల్లా ఉద్యోగాల జాబితాలు: సీఎం జగన్..!జిల్లాస్థాయిలో యాభైశాతం ఉద్యోగాలు: మహిళలకే డిసెంబర్‌ 15 కల్లా ఉద్యోగాల జాబితాలు: సీఎం జగన్..!

స్పందన పరిష్కారాలపై శిక్షణ..
స్పందన పై సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. స్పందనలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యతకోసం స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌పై 6 జిల్లాల్లో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన చోట్లకూడా ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు. కలెక్టర్లు, ఎమ్మార్వోలు, ఎస్సైలు, మున్సిపల్‌ కమిషనర్లు...తదితర అధికారులు ఈశిక్షణ కార్యక్రమంలో ఉండేట్టుగా చూడాలని నిర్దేశించారు. వినతుల పరిషారంలో నాణ్యత అన్నది చాలా ముఖ్యమని సీఎం అభిప్రాయపడ్డారు. దానికోసమే ఈ ప్రయత్నాలన్నీ అంటూ అధికారులకు స్పష్టం చేసారు. ఒకరు ఒక విజ్ఞాపన పత్రంతో వచ్చినప్పుడు వారితో మనం ఎలా వ్యవహరిస్తున్నామన్నది ముఖ్యమని సీఎం సూచించారు. అర్జీ తీసుకువస్తున్న వ్యక్తిని మనం ట్రీట్‌ చేస్తున్న విధానం చాలా ముఖ్యమైందని.. అదే విధంగా.. మనం ఒక అర్జీతో ఎవరిదగ్గరకైనా వెళ్లినప్పుడు మనకు ఎలాంటి స్పందన కావాలని కోరుకుంటామో అలాంటి స్పందననే అధికారులు చూపించాలని నిర్దేశించారు.

ACB preparing plan for rides in big way with Cm Orders

సేవ చేయటానికే మనం..
అధికారమన్నది చెలాయించడానికి కాదు..మనం సేవచేయడానికే ఉన్నామని సీఎం మరోసారి స్పష్టం చేసారు. నా దగ్గర నుంచి కింది స్థాయి అధికారి వరకూ ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలన్నారు.
పబ్లిక్‌ మీద అథారిటీ చెలాయించడానికి కాదు మనం ఉన్నదిజజమనం పబ్లిక్‌ సర్వెంట్లమన్న విషయాన్ని మరిచిపోవద్దని హితబోధ చేసారు. అవినీతి అన్న అంశంమీద పోరాటాన్ని అగ్రెసివ్‌గా తీసుకోవాలని సీఎం గట్టిగా ఆదేశించారు. ఎక్కడా అవినీతికి చోటులేదన్న విషయం కింది స్థాయి అధికారుల వరకూ చేరాలని..ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. వచ్చే రెండు మూడు వారాల్లో ఏసీబీని పెద్ద ఎత్తున రంగంలోకి దించుతున్నామని సీఎం స్వయంగా వెల్లడించారు. చాలా చురుగ్గా ఏసీబీ పనిచేస్తుందని సీఎం స్పష్టం చేయటంతో..రానున్న రోజుల్లో ఏ స్థాయిలో ఈ దాడులు ఉంటాయి.. ఏసీబీ హిట్ లిస్టులో ఎవరెవరు దొరుకుతారు అనేది ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది.

English summary
ACB preparing plan for rides in big way with Cm Orders. In coming days ACB may target as per hit list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X