నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రవాణా శాఖ ఏఓ కృష్ణ కిషోర్ నివాసం పై అనిశా అధికారుల తనిఖీలు...భారీగా అక్రమాస్తుల గుర్తింపు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో మరో అవినీతి అధికారిపై ఎసిబి పంజా విసిరింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారనే సమాచారంతో నెల్లూరు రవాణా శాఖలో ఏఓ గా పనిచేస్తున్న కృష్ణ కిషోర్ నివాసం పై అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

నెల్లూరు ఆర్ టివో ఎఓ గా పనిచేస్తున్న కృష్ణ కిషోర్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే పక్క సమాచారంతో ఎసిబి అధికారులు ఈ తనిఖీలు ప్రారంభించినట్లు తెలిసింది. నెల్లూరులోని ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు ఇళ్లల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే నెల్లూరు నగరంలో రవాణాశాఖ ఏజెంట్లుగా ఉన్న చెంచయ్య, ఎల్లయ్య ఇళ్లల్లోనూ సోదాలు ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించడం గమనార్హం. వీరిద్దరూ కృష్ణకిషోర్‌ బినామీలుగా ఎసిబికి సమాచారం అందివుంటుందని భావిస్తున్నారు. అలానే ఆయన సోదరి ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. తిరుపతి నుంచి వచ్చి ఏసీబీ అధికారులు రెండు బృందాలు విడిపోయి మొత్తం ఏడు చోట్ల ఈ తనిఖీలు సాగిస్తున్నారు.

ACB Raids on Nellore RTO AO Krishna kishore Houses

అక్రమాస్తులు భారీగా గుర్తింపు....
ఎసిబి అధికారులు ఏకకాలంలో జరిపిన ఈ తనిఖీల్లో కృష్ణ కిషోర్ కు చెందిన అక్రమాస్తులను భారీగా గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా కృష్ణ కిషోర్ తన అక్రమార్జితాలను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టినట్లుగా ఎసిబి అధికారులు కనుగొన్నారు. ఆయనకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 8 ఇళ్లు, పది ఇళ్ల స్థలాలు, నరసరావుపేట, విశాఖలో 24.92 ఎకరాలను అధికారులు గుర్తించారు. అలాగే 250 గ్రా.బంగారం, 350 గ్రా. వెండి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కృష్ణకిశోర్‌ తండ్రి పేరుతో నరసరావుపేటలో డ్రైవింగ్ స్కూల్, గన్నవరంలో తండ్రి పేరుతోనే మరో ప్లాస్టింగ్ రీసైక్లింగ్ యూనిట్ ను కూడా గుర్తించారు. సోదరుడితో లారీల వ్యాపారం చేయిస్తున్నట్లు తెలిసింది.

ACB Raids on Nellore RTO AO Krishna kishore Houses

గుంటూరు జిల్లాలోనే ఎక్కువ...
అయితే కృష్ణ కిషోర్ తన అక్రమసొమ్ముతో ఎక్కువగా గుంటూరు జిల్లాలో భూములు,స్థలాలు, ఇళ్లు,పొలాలు కొనడానికి వినియోగించడం విశేషం. గుంటూరు జిల్లాలో ఆయన ఆస్తుల వివరాలు ఇవి....గుంటూరులోని నల్లపాడు, స్తంభాలగరువు, కొరిటపాడు, సత్తెనపల్లిలో ఇళ్లు, గుంటూరు, గోరంట్ల, అగాధవరప్పాడులో ఇళ్ల స్థలాలు, ఈదులపాలెం, తాడికొండలో ఇళ్ల స్థలాలను గుర్తించారు. గుంటూరు జిల్లా నరసారావుపేట మండలం పిట్లూరివారిపాలెం, కాకానిలో పొలాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. నెల్లూరులోని వేదాయపాలెంలో ఇల్లు, మాగుంట లేఅవుట్‌లో అపార్ట్‌మెంట్‌, ఒంగోలు దగ్గర పేర్నమిట్లలో అపార్ట్‌మెంట్, మార్కాపురంలో ఇంటి స్థలాన్ని గుర్తించారు. విజయనగరం జిల్లా కీతన్నపేటలో ఇంటిస్థలం, విశాఖ జిల్లా రామాపురంలో రెండు ఇళ్లస్థలాలను ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఏదేమైనా నామమాత్రపు దాడులలు కాకుండా భారీ తిమింగాలాలే లక్ష్యంగా ఎసిబి ఇటీవలి కాలంలో జరుపుతున్న దాడులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

English summary
nellore: The Anti-Corruption Bureau (ACB) conducted simultaneous raids on the properties of an RTO AO Krishna kishore in nellore and found huge assets and Some Important Documents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X