విశాఖ వుడా అర్బన్ ప్లానర్ ప్రదీప్‌కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
విశాఖపట్టణం: విశాఖ వుడా అర్బన్ ప్లానర్ ప్రదీప్‌కుమార్ ఇంటిపై సోమవారం తెల్లవారుజాము నుండి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు.
ప్రదీప్ కుమార్‌తో పాటు ఆయన స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్ళపై కూడ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ఏపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు.

ప్రదీప్ కుమార్ స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్ళలో కూడ దాడులు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్, విశాఖపట్టణం, అనంతపురం, ఒంగోలు పట్టణాల్లో కూడ దాడులు కొనసాగుతున్నాయి.
ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో సోమవారం ఉదయం నుండి ఏసీబీ అధికారులు ప్రదీప్‌కుమార్ ఇంటిపై దాడులు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు ప్రకటించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!