కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీతం కావాలంటే..లంచం కొట్టాల్సిందే:ఎసిబికి పట్టుబడ్డ రిమ్స్‌ అధికారి

|
Google Oneindia TeluguNews

కడప: ఎసిబి వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. రిమ్స్‌ పరిపాలనాధికారి ఆర్‌.భరత్‌మోహన్‌సింగ్‌ ఒక ఉద్యోగి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డారు. కడప రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చోటుచేసుకున్నఈ ఘటన కలకలం సృష్టించింది

ఎసిబి డిఎస్‌పి నాగరాజు మాట్లాడుతూ రిమ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించిన వివరాల మేరకు...అనంతపురం ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో ఆఫీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సి.సురేష్‌కుమార్‌రెడ్డి నవంబర్‌లో కడప రిమ్స్‌కు బదిలీపై వచ్చారు. ఆ మేరకు రిమ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎఒ భరత్‌మోహన్‌ సింగ్‌కు సి.సురేష్‌కుమార్‌రెడ్డి జాయినింగ్‌ లెటర్‌ ఇచ్చారు.

ACB traps RIMS Officer with Rs.60 thousand bribe

అయినప్పటికి నవంబర్ నుంచి ఇప్పటివరకు ఎవో ఆర్‌.భరత్‌మోహన్‌సింగ్‌ అతనికి సూపరింటెండ్‌ సీటును కేటాయించలేదు. అంతే కాదు మూడు నెలలకు సంబంధించి జీతాలు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సి.సురేష్‌కుమార్‌రెడ్డికి సీటు కేటాయింపు చెయ్యాలన్నా, జీతం చెల్లించాలన్నా తనకు లంచం ఇవ్వాలని ఎవో ఆర్‌.భరత్‌మోహన్‌సింగ్‌ డిమాండ్ చేశారు. లంచం లక్ష రూపాయలు ఇస్తేనే మీకు సంబంధించిన పనులు అవుతాయని రిమ్స్‌ ఎఒ స్పష్టం చేశారు.

దీంతో్ సురేష్‌కుమార్ రెడ్డి తమను సంప్రదించి ఈ విషయమై ఫిర్యాదు చేశారని ఎసిబి డిఎస్‌పి నాగరాజు చెప్పారు. దీంతో ఏవో భరత్‌మోహన్‌సింగ్‌ కు సురేష్‌కుమార్ రెడ్డి రూ.60 వేలు ఇస్తుండగా దాడులు చేసి పట్టుకున్నామని తెలిపారు. భరత్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

English summary
In a major catch, the Anti Corruption Bureau (ACB) nabbed Rajiv Gandhi Institute of Medical Sciences administrative officer R. Bharat mohan singh while he was allegedly accepting Rs 60 thousand as bribe from a employee, at his office on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X