హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైజాగ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పోతురాజు అక్రమాస్తులు 10 కోట్లు..! (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: లంచం తీసుకుంటూ ఇటీవల ఏబీసీ అధికారులకు చిక్కిన విశాఖలోని జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1 పిల్లి పోతురాజు అక్రమాస్తులను రూ. 1.20 కోట్లుగా గుర్తించారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం వీటి విలువ సుమారు రూ. 10 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పోతురాజు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోతురాజు, ఆయన బంధువులతో పాటు, రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తోన్న పైడిరాజు ఇంటిపైనా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

బుధవారం ఆశీలుమెట్ట టింపని పాఠశాల గేటు ఎదురుగా ఉన్న పోతురాజు అపార్ట్‌మెంట్‌లో ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేశారు. ఇంట్లోని దస్త్రాలు పరిశీలించగా విలువైన ఆస్తులు బయటపడ్డాయి.

మేనకోడలు, మామ, బావమరుదులు, రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే పైడిరాజు అనే వ్యక్తి పేరున పోతురాజు ఆస్తులు ఉంచినట్లు డీఎస్పీ వివరించారు. భీమిలిలో బావమరిది పేరుమీద, మధురవాడలో మేనకోడలు పేరు మీద ఫ్లాట్లు ఉన్నాయని, దాకమర్రిలో 4.50 ఎకరాలు, భోగాపురంలో ఎకరం వ్యవసాయభూమికి సంబంధించిన పత్రాలు లభించినంట్లు వివరించారు.

బావమరిది పేరు మీద ఫ్లాట్ ఉన్నప్పటికీ, కొనుగోలు చేసిన సమయంలో పోతురాజు బావమరది పోటల్‌లో పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. సీబీఎం కాంపౌండ్, జీఅర్‌టీ దిగువలో రూ. 40 లక్షల విలువైన ఫ్లాట్ గుర్తించినట్లు తెలిపారు.

భీమిలిలో 1.20 ఎకరాల భూమిని మామ, బావమరిది పిల్లల పేర్లపై ఉంచారని, దాని విలువ రూ. 32 లక్షలు ఉంటుందని వివరించారు. ఎల్‌ఐసీ బాండ్లు రూ. 3 లక్షలు, రూ. 2 లక్షల ఇతర బాండ్లు, 300 గ్రాముల బంగారం, 1.50 కిలోల వెండి, బ్యాంక్‌లో రూ. 19 లక్షల డిపాజిట్లు, ఇంట్లో రూ. 17.50 లక్షలు లభించినట్లు వివరించారు.

 వైజాగ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పోతురాజు అక్రమాస్తులు 10 కోట్లు

లంచం తీసుకుంటూ ఇటీవల ఏబీసీ అధికారులకు చిక్కిన విశాఖలోని జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1 పిల్లి పోతురాజు అక్రమాస్తులను రూ. 1.20 కోట్లుగా గుర్తించారు.

వైజాగ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పోతురాజు అక్రమాస్తులు 10 కోట్లు

వైజాగ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పోతురాజు అక్రమాస్తులు 10 కోట్లు

ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం వీటి విలువ సుమారు రూ. 10 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పోతురాజు పట్టుబడిన సంగతి తెలిసిందే.

వైజాగ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పోతురాజు అక్రమాస్తులు 10 కోట్లు

వైజాగ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పోతురాజు అక్రమాస్తులు 10 కోట్లు

కొద్ది రోజుల క్రితం రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పోతురాజు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోతురాజు, ఆయన బంధువులతో పాటు, రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తోన్న పైడిరాజు ఇంటిపైనా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

 వైజాగ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పోతురాజు అక్రమాస్తులు 10 కోట్లు

వైజాగ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పోతురాజు అక్రమాస్తులు 10 కోట్లు

బుధవారం ఆశీలుమెట్ట టింపని పాఠశాల గేటు ఎదురుగా ఉన్న పోతురాజు అపార్ట్‌మెంట్‌లో ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేశారు. ఇంట్లోని దస్త్రాలు పరిశీలించగా విలువైన ఆస్తులు బయటపడ్డాయి.

 వైజాగ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పోతురాజు అక్రమాస్తులు 10 కోట్లు

వైజాగ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పోతురాజు అక్రమాస్తులు 10 కోట్లు

మేనకోడలు, మామ, బావమరుదులు, రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే పైడిరాజు అనే వ్యక్తి పేరున పోతురాజు ఆస్తులు ఉంచినట్లు డీఎస్పీ వివరించారు. భీమిలిలో బావమరిది పేరుమీద, మధురవాడలో మేనకోడలు పేరు మీద ఫ్లాట్లు ఉన్నాయని, దాకమర్రిలో 4.50 ఎకరాలు, భోగాపురంలో ఎకరం వ్యవసాయభూమికి సంబంధించిన పత్రాలు లభించినంట్లు వివరించారు.

 వైజాగ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పోతురాజు అక్రమాస్తులు 10 కోట్లు

వైజాగ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పోతురాజు అక్రమాస్తులు 10 కోట్లు

బావమరిది పేరు మీద ఫ్లాట్ ఉన్నప్పటికీ, కొనుగోలు చేసిన సమయంలో పోతురాజు బావమరది పోటల్‌లో పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. సీబీఎం కాంపౌండ్, జీఅర్‌టీ దిగువలో రూ. 40 లక్షల విలువైన ఫ్లాట్ గుర్తించినట్లు తెలిపారు.

 వైజాగ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పోతురాజు అక్రమాస్తులు 10 కోట్లు

వైజాగ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పోతురాజు అక్రమాస్తులు 10 కోట్లు

భీమిలిలో 1.20 ఎకరాల భూమిని మామ, బావమరిది పిల్లల పేర్లపై ఉంచారని, దాని విలువ రూ. 32 లక్షలు ఉంటుందని వివరించారు. ఎల్‌ఐసీ బాండ్లు రూ. 3 లక్షలు, రూ. 2 లక్షల ఇతర బాండ్లు, 300 గ్రాముల బంగారం, 1.50 కిలోల వెండి, బ్యాంక్‌లో రూ. 19 లక్షల డిపాజిట్లు, ఇంట్లో రూ. 17.50 లక్షలు లభించినట్లు వివరించారు.

English summary
Anti-Corruption Bureau (ACB) cops registered a disproportionate asset case against joint sub-registrar Pilli Pothuraju on the charge of amassing wealth disproportionate to known sources of income. The cops seized documents and properties worth Rs 50 crore as per market value.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X