వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెద్ద నోట్ల రద్దుతో జగన్‌కు జ్వరం: అచ్చెన్నాయుడు
పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో ప్రతిపక్ష నేత జగన్‌కు జ్వరం పట్టుకుందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. మంగళవారం బుధవారపేటలో నిర్వహించిన జనచైతన్య యాత్రను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తండ్రి ఆధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.లక్ష కోట్లు అక్రమంగా ఆర్జించిన జగన్ వాటిని గోదాంలో దాచుకున్నారని, పెద్దనోట్ల రద్దుతో వాటిని ఎలా కాపాడుకోవాలో అర్థంకాక గత 14 రోజులుగా జ్వరం పట్టి ముసుగేసి పడుకున్నారన్నారు.