వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ మంత్రుల కాన్వాయ్ లో ప్రమాదం ... సేఫ్ గా బయటపడ్డ మేకపాటి గౌతమ్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్

|
Google Oneindia TeluguNews

ఏపీ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లకు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లి టోల్ ప్లాజా వద్ద ఏపీ మంత్రుల కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సోమవారం నాడు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్ జిల్లాల్లో పర్యటించడానికి వెళుతున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

మంత్రుల కాన్వాయ్ లో ఒకకారు సడన్ బ్రేక్ వేయటంతో దాని వెనుక ఉన్న ఆరు కార్లు ఒకదానికొకటి డీ కొన్నాయి. దీంతో ఆరు కార్ల ముందు భాగం ధ్వంసం అయ్యింది . నెల్లూరు నుంచి మర్రిపాడు మండలం కృష్ణాపురం లో జరిగిన హైలెవల్ కెనాల్ ఫేజ్ 2 శంకుస్థాపన కి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో మంత్రులు ఊపిరిపీల్చుకున్నారు . కాసేపట్లో సోమశిల హై లెవెల్ కెనాల్ ఫేజ్-2 శంకుస్థాపన కార్యక్రమం సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు.

Accident in convoy of AP ministers ... Mekapati Gautam Reddy and Anil Kumar Yadav safe

Recommended Video

Andhra Pradesh : కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం.. ఊపందుకున్న పునర్విభజన ప్రక్రియ!

460 కోట్ల వ్యయంతో ఫేజ్ 2 నిర్మాణ పనులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . మంత్రుల కాన్వాయ్ లోని వాహనాల ధ్వంసమైన ఘటన మినహాయించి, ఎవరికి ఎలాంటి ఆపద వాటిల్లలేదు. ఘటన జరిగిన తర్వాత కాసేపటికి మంత్రులు అక్కడినుంచి బయలుదేరి శంకుస్థాపనకు బయలుదేరి వెళ్ళారు.

English summary
AP ministers Mekapati Gautam Reddy and Anil Kumar Yadav escaped a major accident. The cars of the convoy of AP ministers collided with each other at DC Palli toll plaza in Marripadu zone of Nellore district. The incident took place on Monday while Minister Mekapati Gautam Reddy and Anil Kumar Yadav were on a tour of the districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X