హర్షవర్ధన్ హత్య కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని కోఠీ ప్రగతి మహావిద్యాలయ కళాశాలలో హత్యకు గురైన హర్షవర్ధన్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు సతీష్‌ను సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. ఆ తర్వాత నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలించారు. ర్యాంగింగ్ చేయవద్దని చెప్పినందుకు సతీష్ హర్షవర్ధన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో హర్షవర్ధన్ మరణించాడు.
ప్రగతి హైదరాబాదులోని మహావిద్యాలయలో శనివారం ఆ సంఘటన చోటు చేసుకుంది. ప్రగతి విద్యాలయానికి చెందిన హర్షవర్ధన్ బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో జియాగూడకు చెందిన సతీష్ బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

శనివారం ఉదయం తరగతులకు వెళుతుండగా సతీష్ ఓ యువతిని టీజ్ చేశాడు. ఆ తర్వాత బయటకి వచ్చినప్పుడు ఆమెను మరోసారి టీజ్ చేశాడు. ఆ విద్యార్థిని క్లాస్‌మేట్ అయిన హర్షవర్ధన్ ర్యాగింగ్ చేసిన సతీష్‌ను అడ్డుకున్నాడు. ఆ అమ్మాయిని ఏడిపించవద్దన్నా అని సూచించాడు. దానికి సతీష్ ఘాటుగా స్పందించాడు
తాను సీనియర్‌ను అని, ఏదైనా చేస్తానని దురుసుగా సమాధానమిచ్చాడు. ఓ జూనియర్ విద్యార్థి నలుగురిలో తనను నిలదీశాడన్న విషయాన్ని సతీష్ జీర్ణించుకోలేకపోయాడు. మూడో అంతస్తులోని హర్షవర్ధన్ తరగతి గదికి లంచ్ సమయంలో వెళ్లి పిడిగుద్దులు కురిపించాడు. అతని చాతి, మెడ, తల పైన దాడి చేశాడు. హర్ష తల బెంచ్‌కు తగలడంతో స్పృహతప్పి పడిపోయాడు.
వెంటనే హర్షవర్ధన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. తలలో రక్తం గడ్డకట్టి పరిస్థితి విషమంగా ఉండటంతో కేర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అతను మృతి చెందాడు. హర్షవర్ధన్ తిలక్ రోడ్డులోని రాంకోఠి వాసి.












Click it and Unblock the Notifications