విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెప్పాలనుకున్నదే లేఖలో రాశా: జగన్‌పై దాడి చేసిన వ్యక్తి

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం సెషన్స్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. అనంతరం కోర్టు నుంచి తీసుకెళ్తుండగా నిందితుడిని మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు వేశారు.

ఈ సందర్భంగా తాను చెప్పాలనుకున్నదే లేఖలో రాశానని శ్రీనివాస్ తెలిపాడు. అందులోనే చూసుకోండి.. అంటూ తెలిపాడు. నిందితుడిని భారీ బందోబస్తు మధ్య పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.

'చంపాలనే దాడి, జగన్ తప్పించుకున్నారు': విమానాశ్రయంలో ఏం జరిగిందంటే..?'చంపాలనే దాడి, జగన్ తప్పించుకున్నారు': విమానాశ్రయంలో ఏం జరిగిందంటే..?

accused srinivas on knife attack on jagan issue

గురువారం మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో సెల్ఫీ తీసుకుటానంటూ వచ్చి శ్రీనివాస్ ఆయనపై కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడి అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.

విమానాశ్రయంలో ప్రాథమిక చికిత్స తీసుకున్న జగన్.. ఆ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జగన్ చికిత్స తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

English summary
Accused srinivas on knife attack on YS Jaganmohan Reddy issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X