అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్‌కు అచ్చం నాయుడు హెచ్చ‌రిక‌: అనుభ‌వం..అవ‌గాహ‌న లేదు: వేధించినా వెన‌క్కు త‌గ్గం..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు టీడీపీ నేత అచ్చంనాయుడు స‌వాల్ చేసారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..టీడీపీ నేత‌ల‌ను వైసీపీ ప్ర‌భుత్వం వేధిస్తోంద‌ని అచ్చంనాయుడు ఆరోపించారు. సీఎం జ‌గ‌న్ ఎంత వేధించినా తాము వెన‌క్కు త‌గ్గ‌బోమ‌ని తేల్చి చెప్పారు. నెల రోజుల పాల‌న‌లో జ‌గ‌న్ అనుభ‌వ‌రాహిత్యం..అవ‌గాహ‌న లేమి బ‌య‌ట ప‌డిం ద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల పైన పోరాటం చేస్తామ‌ని అచ్చంనాయుడు హెచ్చ‌రించారు.

అన్ని అనుమ‌తులు ఉన్నాయి..
మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్మించిన ప్ర‌జా వేదిక‌ను కూల్చివేసిన ప్ర‌భుత్వం..ప్ర‌స్తుతం ఆయ‌న నివాసం ఉంటున్న భవ‌న య‌జ‌మాని లింగ‌మనేనికి నోటీసు ఇచ్చింది. న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతంలో నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా అక్ర‌మ నిర్మాణం చేసార‌ని..వారంలోగా దీని పైన స‌మాధానం ఇవ్వాల‌ని నోటీసు జారీ చేసారు. దీని పైన టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీ ముఖ్యుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

Acham Naidu warned CM Jagan that TDP continue fight for public at any stage. CM Jagan want to harass Chandra babu

ఆ స‌మావేశంలో తాజాగా సీఆర్డీఏ అధికారులు టీడీపీ అధినేత నివాసం ఉంటున్న ఇంటి య‌జ‌మానికి నోటీసు ఇచ్చిన అంశం పైనే ఎక్కువ‌గా చ‌ర్చించారు. తాము ఇక్క‌డ‌కు వ‌చ్చే ముందు అన్ని అనుమ‌తుల‌ను ప‌రిశీలించామ‌ని..అన్నీ స‌క్ర‌మంగా ఉన్న త‌రువాత‌నే అద్దెకు తీసుకున్నామ‌ని చంద్ర‌బాబు నేత‌ల‌కు వివ‌రించిన‌ట్లు స‌మాచారం. దీని పైన తొలుత చంద్ర‌బాబు మీడియా స‌మావేశం ద్వారా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని భావించినా..అవ‌స‌రం లేద‌ని సీనియ‌ర్ నేత‌ల ద్వారా మాట్లాడించాల‌ని నిర్ణ‌యించారు.

అవ‌గాహ‌న‌..అనుభ‌వం లేని సీఎం
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన టీడీపీ నేత అచ్చంనాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. వైఎస్‌ జగన్‌కు అనుభవం.. అవగాహన లేదని తీవ్ర స్థాయిలో మండి ప‌డ్డారు. చంద్రబాబుపై జగన్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అచ్చం నాయుడు ఆరోపించారు. నాడు అన్ని పరిశీలించాకే చంద్రబాబు భవనాన్ని అద్దెకు తీసుకున్నారని.. ఆ భవనాన్ని 2007కు ముందే నిర్మించారన్న విషయాన్ని గుర్తు చేసారు. భవనంలో ఇతర నిర్మాణాలకు ఎన్‌వోసీ కూడా తీసుకున్నార ని.. భవన యజమాని రూ.18 లక్షల నాలా పన్ను కూడా చెల్లించారంటూ ర‌సీదులు చూపించారు.

గత ప్రభుత్వ పాలన పై ఎంక్వైరీ వేయడం దౌర్భాగ్యం అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ ఎంత వేధించినా వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తామని అచ్చెన్నాయుడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను హెచ్చ‌రించారు. నోటీసుల పైన ఏం చేయాల‌నే దాని పైన త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

English summary
Ex Minister Acham Naidu warned CM Jagan that TDP continue fight for public at any stage. CM Jagan want to harass TDP Chief Chandra babu in many ways. But TDP never step back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X