వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అచ్చెన్నాయుడుకి ఒకే ఒక్క గన్ మ్యాన్ ..వద్దని వెనక్కు పంపిన అచ్చెన్న

|
Google Oneindia TeluguNews

Recommended Video

అచ్చెన్నాయుడుకి ఒకే ఒక్క గన్ మ్యాన్... వద్దని వెనక్కు పంపిన అచ్చెన్న!! | Oneindia Telugu

ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రతిపక్ష నేతల భద్రత తగ్గిస్తూ పోతుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత తగ్గించడంతో పాటు గన్నవరం విమానాశ్రయంలో ఆయనను సాధారణ వ్యక్తిలా తనిఖీ చేశారని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఆ పార్టీ నేతలు వైసీపీ వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా అచ్చెన్నాయుడు తన భద్రత విషయంలో వైసీపీ పై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీ వర్సెస్ టీడీపీ .. కంచె సీన్ రిపీట్ .. టీడీపీ వాళ్ళు రావద్దని అడ్డుగోడ కట్టిన వైసీపీవైసీపీ వర్సెస్ టీడీపీ .. కంచె సీన్ రిపీట్ .. టీడీపీ వాళ్ళు రావద్దని అడ్డుగోడ కట్టిన వైసీపీ

చంద్రబాబుకు , టీడీపీ నేతలు భద్రత కుదించిన వైసీపీ సర్కార్

చంద్రబాబుకు , టీడీపీ నేతలు భద్రత కుదించిన వైసీపీ సర్కార్

ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలోని కీలక నేతలకు భద్రతను కుదిస్తూ భద్రతా సమీక్షా కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయం కొత్త వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, తంగిరాల సౌమ్య, ఉప్పులేటి కల్పన, శ్రీరాం రాజగోపాల్, బోడె ప్రసాద్‌కు ఉన్న 1+1 భద్రతను వారు ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం తొలగించారు.అయితే ఎన్నికల్లో గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలకు సైతం భద్రతను సగానికి తగ్గించారు. ఇక మాజీ ఎమ్మల్యే బొండా ఉమాకి నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో 1+1 భద్రతను కల్పిస్తున్నారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర భద్రతను కూడా 1+1కు తగ్గించారు. తనకు ఉన్న 2+2 భద్రతను 1+1కు తగ్గించడంపై బుద్దా అసహనం వ్యక్తం చేశారు.

ఒకే ఒక్క గన్ మ్యాన్ ను పంపటంతో తీవ్ర నిర్ణయం తీసుకున్న అచ్చెన్న.. గన్ మ్యాన్ లేకుండానే పర్యటన

ఒకే ఒక్క గన్ మ్యాన్ ను పంపటంతో తీవ్ర నిర్ణయం తీసుకున్న అచ్చెన్న.. గన్ మ్యాన్ లేకుండానే పర్యటన

ఇక తాజాగా మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు భద్రతను కూడా కుదించిన వైసీపీ సర్కార్ ఒకే ఒక్క గన్ మ్యాన్ ను పంపించటంతో అచ్చెన్న షాక్ తిన్నారు. దీంతో ఆయన తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు పంపిన ఒకే ఒక్క గన్‌మన్‌ను వెనక్కి పంపారు. ఆ ఒక్క గన్ మ్యాన్ మాత్రం ఎందుకని అసహనం వ్యక్తం చేశారు. దీంతో బుధవారం అచ్చెన్న రోజంతా విజయవాడలో గన్‌మన్ లేకుండానే పర్యటించారు.

తనకు గన్ మ్యాన్ అవసరం లేడని వెనక్కు పంపి వైసీపీ తీరుపై తన నిరసన తెలియజేసిన అచ్చెన్న

తనకు గన్ మ్యాన్ అవసరం లేడని వెనక్కు పంపి వైసీపీ తీరుపై తన నిరసన తెలియజేసిన అచ్చెన్న

అచ్చెన్నాయుడికి నిన్నటి వరకు 4 ప్లస్ 4 గన్‌మెన్ సౌకర్యం ఉండేది. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం టీడీపీ నేతలకు భద్రతను కుదిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా అచ్చెన్న భద్రతను 2 ప్లస్ 2గా మార్చింది. మంగళవారం వరకు ఆయనకు 2 ప్లస్ 2 పద్ధతిలోనే గన్‌మెన్ ఉన్నారు. అయితే, బుధవారం ఒకే ఒక్క గన్‌మన్‌ను ప్రభుత్వం అచ్చెన్న వద్దకు పంపింది. దీనిని తీవ్రంగా భావించిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తనకు గన్‌మన్ అవసరం లేదని అతడిని వెనక్కి పంపారు.

English summary
Former minister and Srikakulam district Tekkali MLA Achchennaidu has also been shocked by the fact that YCP Sarkar has sent only one gunman. He made a serious decision. The only gunman the government sent him was back. That one gun man is embarrassed why. On Wednesday, he traveled all day at Vijayawada without gunman.Until yesterday, the Achchennaidu had 4 plus 4 gunmen. However, since the YCP came to power, the government has been providing security to TDP leaders. As a part of this, it has changed the value of the security to 2 plus 2. Until Tuesday he had 2 plus 2 gunmen. On Wednesday, however, the government sent only one gunman to the edge. Sensing this, former minister Achcheniadu dismissed him saying he did not need a gunman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X