ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళపై యాసిడ్ దాడి: ఎన్టీఆర్ విగ్రహ ఫలకం ధ్వంసం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Acid attack on woman in Khammam
ఖమ్మం/: ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని బస్టాండు సెంటర్లో మంగళవారం ఓ యువకుడు ఓ మహిళ పైన యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పోలీసు స్టేషన్‌కు కొద్ది దూరంలో జరిగింది. గాయపడిన బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడు మహిల వెనుక నుండి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలైనప్పటికీ బాధితురాలికి ప్రాణాపాయం తప్పింది.

బాధితురాలిని ప్రమీలగా గుర్తించారు. ఆమె భర్త పాల్వంచలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె తన కొడుకుతో పాటు బస్టాండు సెంటర్లో నిలబడి ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. నిందితుడిని కూడా శ్రీనివాస్‌గా గుర్తించారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలోను మహిళపై దాడికి యత్నం చేసినట్లుగా తెలుస్తోంది.

ఇద్దరు రైతులు మృతి

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివాపురంలో విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి చెందారు. పొలంలో పని చేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

ఎర్ర చందనం పట్టివేత

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో అటవీశాఖ అధికారులు తనిఖీల్లో కోటి రూపాయల విలువైన ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్నారు. పద్దెనిమిది మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు.

ఆటో బోల్తా

కరీంనగర్ జిల్లా ఆటో బోల్తా పడి పదకొండు మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. రాంలచ్చక్కపేట నుండి మెట్‌పల్లి పాఠశాలకు వస్తుండగా మెట్‌పల్లి సమీపంలో ఓ విద్యార్థి హఠాత్తుగా ఆటోకు అడ్డు వచ్చాడు. దీంతో అదుపు తప్పి బోల్తా పడింది. గాయపడ్డ వారిని 108లో ఆసుపత్రికి తరలించారు.

ఎన్టీఆర్ శిలా ఫలకం ధ్వంసం

ఖమ్మం జిల్లా పాల్వంచ పరిధిలోని దమ్మపేట క్రాస్ రోడ్డు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసిన దిమ్మ చుట్టు ఉన్న గ్రానైట్, శిలా ఫలకాన్ని సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. టిడిపి నేతలు స్వానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

English summary
A woman suffered burn injuries after one assailant threw acid on her at the Bus Stand Centre in Khammam district on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X