చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫీజుల మంట: రూ.25 కోట్లు బకాయిలు: మోహన్ బాబును రోడ్డెక్కనివ్వని పోలీసులు: హౌస్ అరెస్ట్!

|
Google Oneindia TeluguNews

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లింపులు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ, ప్రముఖ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఛైర్మన్ మంచు మోహన్ బాబు శుక్రవారం నిర్వహించ తలపెట్టిన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది.

నిర్దేశిత సమయం ప్రకారం.. ఉదయం 9 గంటలకు మోహన్ బాబు తిరుపతి సమీపంలోని రంగంపేట క్రాస్ వద్ద గల శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థ నుంచి విద్యార్థులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టాల్సి ఉంది. నిరసన ప్రదర్శన కోసం తిరుపతి రూరల్ పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు.

actor, educationalist Mohan babu have house arrested by Police at Tirupathi

మరో గంటలో ఆయన శ్రీ విద్యానికేతన విద్యాసంస్థకు బయలుదేరాల్సి ఉన్న సమయంలో.. పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. మోహన్ బాబును గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ సమయంలో మోహన్ బాబు వెంట ఆయన కుమారుడు, యువ నటుడు మంచు మనోజ్ ఉన్నారు. ఉదయం 7 గంటలకే పోలీసులు ఆయన నివాసం ఉన్న శ్రీవిద్యానికేతన్‌ క్యాంపస్ కు చేరుకున్నారు.

హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మోహన్ బాబు..నిరసన ప్రదర్శన కోసం తాను అనుమతి కూడా తీసుకున్నానని అన్నారు. ఏ కారణంతో నిర్బంధిస్తారని ప్రశ్నించారు. అయినప్పటికీ- పోలీసులు ఆయనను ఇల్లు కదలనివ్వలేదు. పెద్దఎత్తున మోహరించారు.

సీనియ‌ర్స్ వ‌ర్సెస్ జూనియ‌ర్స్..! ఏపి రాజ‌కీయం ర‌స‌కందాయం..!!సీనియ‌ర్స్ వ‌ర్సెస్ జూనియ‌ర్స్..! ఏపి రాజ‌కీయం ర‌స‌కందాయం..!!

ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను ఒక్క రూపాయి కూడా అందట్లేదంటూ మోహన్ బాబు ఇదివరకే విమర్శించిన విషయం తెలిసిందే. ఆస్తులు అమ్ముకుని విద్యాసంస్థలను నడిపిస్తున్నామని, ఫీజు రీఎంబర్స్ మెంట్ కింద రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయట్లేదని ధ్వజమెత్తారు. 20 కోట్ల రూపాయల మేర బకాయిలు తమ ఒక్క విద్యాసంస్థకే అందాల్సి ఉందని చెప్పారు.

ఈ విషయంపై తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పలుమార్లు లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. చివరికి- రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయడం తప్ప మరో ఆగత్యం కనిపించలేదని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మోహన్ బాబు నిరసన ప్రదర్శన తల పెట్టడాన్ని చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంది. ఓటర్లపై పెను ప్రభావం చూపుతుందనే రాజకీయ కారణంతో.. ప్రభుత్వం మోహన్ బాబును గృహనిర్బంధంలో ఉంచింది.

English summary
Actor and Educationist Dr. Mohan Babu was on Friday morning house-arrested by cops. He had given a call for a rally at 10am by Sri Vidyanikethan educational institutions to protest the delay in fee reimbursement by the Andhra Pradesh government. It was supposed to be a huge rally of hundreds of students in Tirupathi. The administration swung into action to avert the rally as soon as Mohan Babu's schedule became clear. A huge contingent of policemen has been deployed at the actor's educational institutions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X