వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడకెళ్లి చెప్తావా?: బాబు దుమ్ముదులిపిన కృష్ణంరాజు, శ్రీరెడ్డి ఇష్యూపై స్పందన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్ర బాబు నాయుడు పై నిప్పులు చెరిగిన రోజా

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీపై కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత కృష్ణంరాజు శుక్రవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. బీజేపీ పైన తప్పుడు ప్రచారం సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు శుక్రవారం ఒక్కరోజు నిరాహార దీక్ష నేపథ్యంలో కృష్ణంరాజు స్పందించారు. ఏపీకి అన్యాయం జరిగిందని కర్నాటకకు వెళ్లి మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఫిలిం ఛాంబర్‌లో పవన్ కళ్యాణ్, ప్రముఖులందరూ రావాలని ఆదేశంఫిలిం ఛాంబర్‌లో పవన్ కళ్యాణ్, ప్రముఖులందరూ రావాలని ఆదేశం

ఏపీ జీడీపీ 11 శాతం ఉంది సరే, అది ఎక్కడిది?

ఏపీ జీడీపీ 11 శాతం ఉంది సరే, అది ఎక్కడిది?

ఆంధ్రప్రదేశ్ జీడీపీ 11 శాతం ఉందని చెబుతున్నారని, అది ఎలా వచ్చిందని కృష్ణంరాజు ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. విభజనకు ముందు లక్ష కోట్ల అప్పు ఉందని, చంద్రబాబు వచ్చాక అది రూ.2.34 లక్షల కోట్లకు చేరుకుందని మండిపడ్డారు.

అమరావతి డిజైన్లకే మూడేళ్లు పట్టింది

అమరావతి డిజైన్లకే మూడేళ్లు పట్టింది

అసలు అమరావతి డిజైన్లకే మూడేళ్లు పట్టిందని కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రాజకీయపరమైన నిర్ణయంతో విశాఖపట్నానికి రైల్వే జోన్ కచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుతో ఏపీకి పెరిగింది అప్పులు తప్ప చేసిందేమీ లేదన్నారు. ఈ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ పైన కూడా మాట్లాడారు.

శ్రీరెడ్డి ఇష్యూ

శ్రీరెడ్డి ఇష్యూ

శ్రీరెడ్డి ఇష్యూపై స్పందిస్తూ.. పరిశ్రమలో కాస్టింగ్ కౌంచ్ కొత్తేమీ కాదని కృష్ణంరాజు అన్నారు. అన్ని రంగాల్లోను కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పారు. విమర్శించడానికి ఇప్పుడు సినీ పరిశ్రమ ఒక్కటే కనిపించిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో తప్పు జరిగిందని మొత్తం వ్యవస్థనే తప్పుపడతారా అని నిలదీశారు.

కాస్టింగ్ కౌచ్ మచ్చలాంటిది

కాస్టింగ్ కౌచ్ మచ్చలాంటిది

టాలీవుడ్‌లో ప్రస్తుతం జరుగుతోన్న కాస్టింగ్ కౌచ్ తెల్ల పేపర్ పైన మచ్చలాండిది అని కృష్ణంరాజు అన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తే మచ్చను తొలగిస్తాం కానీ పేపర్‌ను చిత్తు కాగితంలా మార్చమని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సినీ పరిశ్రమలో జరుగుతున్న కాస్టింగ్ విషయంలో మాత్రం మొత్తం చిత్తు కాగితంలా తయారు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. అది సరికాదని అభిప్రాయపడ్డారు.

English summary
Film Actor Krishnam Raju fired at Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu for his hunger strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X