• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విపై మోహ‌న్‌బాబు క్లారిటీ!

|

తిరుప‌తి: ప్ర‌తిష్ఠాత్మ‌క తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఛైర్మ‌న్ ప‌ద‌వి కోసం అప్పుడే రేసు మొద‌లైంది. ఈ ప‌ద‌వి కోసం ప‌లువురు ప్ర‌ముఖులు పోటీ ప‌డుతున్నారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ముఖ న‌టుడు, శ్రీ విద్యానికేత‌న్ విద్యాసంస్థ‌ల ఛైర్మ‌న్ మోహ‌న్‌బాబు పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. మోహ‌న్‌బాబుకు టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఖాయ‌మంటూ కొద్దిరోజుల నుంచి ఎడ‌తెరిపి లేకుండా వ‌దంతులు పుట్టుకొస్తున్నాయి.

వైఎస్ఆర్ సీపీ అభ్య‌ర్థుల గెలుపు కోసం..

వైఎస్ఆర్ సీపీ అభ్య‌ర్థుల గెలుపు కోసం..

మోహ‌న్‌బాబు చిత్తూరు జిల్లాకు చెందిన వ్య‌క్తి కావ‌డం, క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ప‌ట్ల అపారమైన భ‌క్తి, విశ్వాసాలు క‌లిగి ఉండ‌టం దీనికి ఓ కార‌ణం కావ‌చ్చు. ఎన్నిక‌లకు కొద్దిరోజుల ముందే ఆయ‌న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన మోహ‌న్‌బాబు.. ఆ సామాజిక వ‌ర్గ ఓటర్లు అధికంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్తృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల విజ‌యం కోసం కృషి చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి, విజయవాడ, చిత్తూరు జిల్లా చంద్రగిరి, పుంగ‌నూరు, ప‌ల‌మ‌నేరు, విశాఖ నార్త్‌, ఒంగోలు వంటి అనేక నియోజకవర్గాల్లో మోహన్ బాబు, ఆయన కుమారుడు, నటుడు మంచు విష్ణు విస్తృతంగా ప్రచారం చేశారు. అభ్యర్థుల విజయానికి తమవంతు పాత్ర పోషించారు.

అన్ని చోట్లా భారీ మెజారిటీ..

అన్ని చోట్లా భారీ మెజారిటీ..

వారిద్దరు ప్ర‌చారం చేసిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యం సాధించారు. భారీ మెజారిటీని సాధించి, ప్ర‌త్య‌ర్థిని చావుదెబ్బ కొట్టారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న చేసిన మేలును మ‌రిచిపోకుండా ప్ర‌తిష్ఠాత్మ‌క టీటీడీ పాల‌క మండ‌లి ఛైర్మ‌న్ ప‌ద‌విని అప్పగించాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం తీసేసుకున్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి. త‌మ పార్టీ అభ్య‌ర్థులు భారీ మెజారిటీని సొంతం చేసుకోవ‌డం వెనుక మోహ‌న్ బాబు కృషి కూడా కొద్దో, గొప్పో ఉంద‌నే అభిప్రాయం వైఎస్ఆర్ సీపీ నేత‌ల్లో వ్య‌క్త‌మైంది.

టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి ఆయ‌నే క‌రెక్ట్‌..

టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి ఆయ‌నే క‌రెక్ట్‌..

ఎలాంటి విష‌యాన్న‌యినా ముక్కుసూటిగా, కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు తేల్చేయ‌డం మోహ‌న్ బాబు నైజం. టీటీడీ వంటి ప‌ద‌విని ఆయ‌నకు అప్ప‌గిస్తే.. అక్క‌డి వ్య‌వ‌స్థ‌, పాల‌నా వ్య‌వ‌హారాలు దారికొస్తాయ‌ని వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్ విశ్వ‌సిస్తోంది. ఇదే విష‌యంపై ప‌లువురు ప్ర‌ముఖులు స్వ‌యంగా మోహ‌న్‌బాబుకు ఫోన్ చేసి, ముంద‌స్తుగా అభినంద‌న‌లు కూడా తెలియ‌జేస్తున్నారు. రెండురోజులుగా ఆయన ఫోన్ ముందస్తు అభినందనలు, శుభాకాంక్షలకు సంబంధించిన మెసేజీలతో నిండిపోయిందట.

నా ల‌క్ష్యం అదొక్క‌టే.. ప‌ద‌వులొద్దు

నా ల‌క్ష్యం అదొక్క‌టే.. ప‌ద‌వులొద్దు

ఇదంతా ఆయ‌న‌కు చిరాకు పుట్టించిన‌ట్టుంది. అందుకే- టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విపై ఆయ‌న క్లారిటీ ఇచ్చేశారు. తాను ప‌ద‌వుల‌ను ఆశించి వైఎస్ఆర్ సీపీలో చేర‌లేద‌ని అన్నారు. వైఎస్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిగా చూడాల‌నే ఏకైక ల‌క్ష్యంతో తాను రాజ‌కీయాల్లోకి పున‌:ప‌్ర‌వేశించానే త‌ప్ప మ‌రో ఉద్దేశంతో కాద‌ని తేట‌తెల్లం చేశారు. వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం కోసం త‌నవంతు ప్ర‌యత్నాల‌ను తాను చేశాన‌ని చెప్పుకొచ్చారు. వైఎస్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిగా చేయాల‌నే త‌న ల‌క్ష్యం నెర‌వేరింద‌ని, ఆ తృప్తి త‌న‌కు చాల‌ని అన్నారు. త‌న‌కు ఎలాంటి ప‌ద‌వులూ వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి వార్త‌ల‌ను పుట్టించ‌వ‌ద్ద‌ని ఆయ‌న మీడియాకు విజ్ఞ‌ప్తి చేశారు.

రాజ‌కీయాల‌కు దూరంగా ఉండి.. మ‌ళ్లీ రీఎంట్రీ

రాజ‌కీయాల‌కు దూరంగా ఉండి.. మ‌ళ్లీ రీఎంట్రీ

సుమారు 20 ఏళ్ల కింద‌టే ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరం అయ్యారు. సినిమాల‌కు ప‌రిమితం అయ్యారు. మొన్న‌టి అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న తెర‌మీదికి వ‌చ్చారు. తిరుప‌తి స‌మీపంలోని రంగంపేట క్రాస్ వ‌ద్ద ఉన్న శ్రీ విద్యానికేత‌న్ విద్యాసంస్థ‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tollywood Actror, Educationalist Mohan Babu has condemned about the rumors of his name under consider for prestigious Tirumala Tirupati Devasthanams Chairmanship. He explained about the rumors that, I have been reading the news and getting calls that I am in the race for TTD Chairman post. My ambition was to see YS Jagan as the Chief Minister of Andhra Pradesh and worked towards it and contributed my bit. I came back to politics because of my belief in as people’s CM and not for any posts or nominations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more