• search
  • Live TV
రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బీజేపీతో బంధంపై మోహన్ బాబు - ప్రధాని మోదీపై ప్రశంసలు : సంకేతాలు అవేనా...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఎదీ మనసులో దాచుకోలేరు. ఉన్నది ఉన్నట్లు చెప్పేయటం ఆయనకు అలవాటు. అదే తన బలం..బలహీనత అని అనేక సార్లు మోహన్ బాబు చెబుతూ వచ్చారు. ఇక, ఇప్పుడు ఆయన బీజేపీతో బంధం గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. కొద్ది రోజుల క్రితం తన జన్మదినం సందర్భంగా తన విద్యాసంస్థల్లో జరిగిన వేడుకల్లో తాను ఎదుర్కొన్న అనుభవాలను మోహన్ బాబు చెప్పుకొచ్చారు. తాను ఎంతోమందికి మేలు చేసానని..తనకు మాత్రం ఎవరూ సహాయ పడలేదన్నారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరానని చెప్పుకొచ్చారు.

మోహన్ బాబు మరోసారి కీలక వ్యాఖ్యలు

మోహన్ బాబు మరోసారి కీలక వ్యాఖ్యలు

రాజకీయంగా అనేక పార్టీలకు ప్రచారం చేసిన అంశాన్ని అందులో ప్రస్తావించారు. ఇక, "మా" ఎన్నికల సమయంలో విష్ణు గెలుపు వెనుక కీలకంగా వ్యవహరించిన మోహన్ బాబు తాను "మా" సభ్యులతో కలిసి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తానని చెప్పారు. కానీ, కొద్ది రోజుల క్రితం విష్ణు ఒక్కరే సీఎం జగన్ ను కలిసారు. అయితే, అది తమ వ్యక్తిగత సమావేశమని స్పష్టం చేసారు.

తాజాగా జరిగిన జాతీయ సంస్కృతి మహోత్సవంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ఎన్టీఆర్ సమయంలో టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లానని..ఆ తరువాత రాష్ట్రంలో బీజేపీ కోసం 1998లోనే పని చేసానని గుర్తు చేసారు. వాజ్ పేయ్.. అద్వానీ.. వెంకయ్య నాయుడుతో కలిసి ఎన్నికల ప్రచారం చేయగా.. బీజేపీకి 18 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ పై ప్రశంసలు కురిపించారు. మోదీకి జై కొట్టారు.

సంకేతాలు ఇచ్చేలా ఉన్నాయంటూ

సంకేతాలు ఇచ్చేలా ఉన్నాయంటూ

ఎందరో కళాకారులు తిండి, ఇళ్లు లేక కష్టాలు పడుతున్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులను ఆదుకుంటున్నారో లేదో మంత్రి అవంతి శ్రీనివాస్ కు తెలుసు అంటూ సెటైర్ వేశారు. తెలంగాణలోనూ జానపద కళాకారులు కష్టాలు పడుతున్నారని చెప్పుకొచ్చారు. అన్నారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఉండటం వల్లే తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్సవాలు జరుగుతున్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఉన్నత పదవులు రావాలని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి పైన తనకు గౌరవం ఉందంటూ మోహన్ బాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొంత కాలంగా సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంలో మోహన్ బాబుకు సీఎం నుంచి ఆహ్వానం పంపినా ఆయనకు అందలేదని విష్ణు గతంలోనే స్పష్టం చేసారు.

రాజకీయాలకు దూరం అని చెబుతూనే..

రాజకీయాలకు దూరం అని చెబుతూనే..

ఇక, ఆ సమయంలో ప్రభుత్వం - సినిమా సమస్యల చర్చలు..నిర్ణయాలు అన్నీ చిరంజీవి కేంద్రంగా జరిగాయి. దీంతో..మోహన్ బాబు - సీఎం జగన్ మధ్య గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు మోహన్ బాబు ఈ సభలోనూ అనేక పార్టీలకు పరిస్థితులకు అనుగుణంగా పలు పార్టీలకు ప్రచారం చేసానని చెబుతూనే.. సీఎం పైన గౌరవం ఉందని వ్యాఖ్యానించారు.

బీజేపీతో సంబంధాలు... తన ప్రచారం అంశాలను ప్రస్తావించటం ద్వారా మోహన్ బాబు ఇక ఇప్పుడు మరోసారి బీజేపీకి దగ్గర అవుతున్నాననే సంకేతాలు ఇచ్చారనే విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో..ఇప్పుడు మోహన్ బాబు భవిష్యత్ అడుగుల పైన ఆసక్తి నెలకొని ఉంది.

English summary
Actor Mohan babu praises PM Modi and speaks of his relation with BJP balancing Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X