వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ రెండు కాకుంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు.. మీకెందుకు : జగన్ కు నటుడు నరేష్ చురకలు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళల భద్రత అంశంపై జరిగిన చర్చపై మాట్లాడుతూ కొంతమంది పెద్దపెద్ద నాయకులు ముగ్గురు కాదు నలుగురు పెళ్ళాలు కావాలని కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దిశా ఘటనపై మాట్లాడుతున్న సందర్భంలో కూడా తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ,తనకు ఒకే ఒక భార్య ఉందని రెండుసార్లు నొక్కిమరీ చేసిన వ్యాఖ్యలు పవన్ ను ఉద్దేశించే అని సభలో ఉన్నవారికి అర్ధం అయ్యింది.

ఇక దీని పై టాలీవుడ్ సినీ నటుడు నరేష్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలు రోజు రోజుకి దిగజారి పోతున్నాయని, రాజకీయాల్లో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియకుండా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు కాకపోతే ముగ్గురు భార్యలు చేసుకుంటే ఏంటి అని, అది వ్యక్తిగత అంశమని జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మొదటి నుండి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ఉన్నా నరేష్ వ్యక్తిగతమైన విషయాల గురించి అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడం సమంజసం కాదని పేర్కొన్నారు.

Actor Naresh counter to Jagan comments on Pawan kalyan

రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని,ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యలపై దృష్టి సారించాలని,ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందని,అది సభలో ప్రస్తావించాల్సిన అంశం కాదని నరేష్ దుయ్యబట్టారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన నరేష్,తన సినీ కెరీర్ ని వదిలిపెట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లారని చెప్పారు. ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడుకోవాలి కానీ,ఇలా వ్యక్తిగతమైన అంశాల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని ఆయన గట్టిగా విమర్శించారు.

English summary
Tollywood star Naresh told that he likes Pawan Kalyan very much. He added that he has left his career which is in peak and entered politics only to serve people. He asserted that politics is not connected to a single person and told that one day, Pawan will succeed. He stressed that he would always extend his support to Pawan Kalyan. Naresh also hit out strongly on those who made comments on Pawan Kalyan about his marriages. He remarked there are many issues to concentrate on rather on one’s personal decisions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X