వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ భవిష్యత్తు నాకు తెలియదు, మరి వాళ్లెందుకు మాట్లాడలేదు: సుమన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ప్రముఖ నటుడు సుమన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన టాలీవుడ్‌లో అడుగు పెట్టి నలభై సంవత్సరాలు అవుతుంది. ఈ నేపత్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

మంత్రి పదవి ఇవ్వడు, దీక్షలు వేస్ట్: వేదికపై బాబుకు జేసీ షాక్, కాంగ్రెస్‌తో పొత్తుపై సీఎం ట్విస్ట్మంత్రి పదవి ఇవ్వడు, దీక్షలు వేస్ట్: వేదికపై బాబుకు జేసీ షాక్, కాంగ్రెస్‌తో పొత్తుపై సీఎం ట్విస్ట్

తన రాజకీయ ప్రవేశంతో పాటు జనసేనాని పార్టీ గురించి మాట్లాడారు. పవన్‌ లాంటి యువ నేత సమాజానికి ఉపయోగపడే సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని, ఆయన ప్రస్తావిస్తున్న సమస్యల గురించి గతంలో ఇతర నేతలు ఎందుకు మాట్లాడలేదని, ఆ సమస్యలను ఎందుకు తీర్చలేదని ప్రశ్నించారు.

పవన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు తెలియదు

పవన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు తెలియదు

పవన్‌ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కుల, మతాలకు అతీతమని సుమన్ చెప్పారు. అయితే రాజకీయాల్లో పవన్‌ కళ్యాణ్ ఎలా రాణిస్తారనే విషయం గురించి మాత్రం తాను ప్రస్తావించలేనని చెప్పారు. ఎందుకంటే పవన్‌ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తనకు తెలియదన్నారు. కానీ జనసేనాని ప్రసంగాలకు యువత ఎంతో బాగా కనెక్ట్‌ అవుతున్నారని చెప్పారు. పవన్‌ను ఆదర్శంగా తీసుకుంటారని చెప్పారు.

పవన్‌కు అది ఉంటేనే నెంబర్ వన్, సీఎం కాగలరు

పవన్‌కు అది ఉంటేనే నెంబర్ వన్, సీఎం కాగలరు

పవన్ కళ్యాణ్ చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చారని సుమన్ చెప్పారు. ఆయనకు యువతలో మంచి పాలోయింగా ఉందని తెలిపారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో జాతక, గ్రహబలం బాగున్నవాళ్లే ముఖ్యమంత్రులు అయ్యారని చెప్పారు. అలాగే పవన్ విషయంలోను అవే కీలకం అవుతాయన్నారు. వాళ్ల జాతకంలో బలం ఉంటేనే కుర్చీలో కూర్చోగలుగుతారని చెప్పారు. పవన్ జాతకం ఎలా ఉందో తనకు తెలియదని, అది బాగుంటే ఆయన నెంబర్ వన్ కాగలరన్నారు. తన అవసరం ఉందనిపిస్తే తాను రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని చెప్పారు.

సుమన్‌కు సత్కారం

సుమన్‌కు సత్కారం

సుమన్ నటనా జీవితం మొదలై నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను గుంటూరు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ అధ్వర్యంలో శనివారం గుంటూరులో సత్కరించారు. ఈ సందర్భంగా కూడా సుమన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ... సుమన్‌ మరిన్ని మంచి పాత్రలు పోషించి నటుడిగా తనకుంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవాలన్నారు.

రాజకీయం, నటన రెండు కళ్లు

రాజకీయం, నటన రెండు కళ్లు

తనకు రాజకీయ గురువు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడేనని సుమన్ వేరుగా చెప్పారు. పదవి ఆశించకుండా టీడీపీకి ప్రచారం చేశానని చెప్పారు. నటన, రాజకీయం తనకు రెండు కళ్లు అని చెప్పారు. బ్యాకింగ్‌లో కింగ్‌ ఉన్నంత వరకే గుర్తింపు అని, స్వయంకృషితో ముందుకు వెళితే గెలుపు తథ్యమని ఆయన అన్నారు.

English summary
Actor Suman praises Jana Sena chief Pawan Kalyan and Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X