వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాన్న చెప్పినట్టే, టిడిపిలోనే చేరతా, రోజాపై పోటీకి సై: వాణీ విశ్వనాథ్

రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి ఉందని చెప్పారు సినీ నటి వాణీ విశ్వనాథ్. అయితే అయితే రాజకీయాల్లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వాణీ విశ్వనాథ్ ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Actress Vani Viswanath to Contest Against Roja రోజాపై పోటీకి సై: వాణీ విశ్వనాథ్ | Oneindia Telugu

హైదరాబాద్: రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి ఉందని చెప్పారు సినీ నటి వాణీ విశ్వనాథ్. అయితే అయితే రాజకీయాల్లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వాణీ విశ్వనాథ్ ప్రకటించారు. రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకొంటే మాత్రం టిడిపిలోనే చేరుతానని సినీ నటి వాణీ విశ్వనాథ్ ప్రకటించారు.

పలు తెలుగు సినిమాల్లో నటించిన వాణీ విశ్వనాథ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తిగా ఉంది. మళయాళ ముద్దుగుమ్మ సినిమాలను వదిలి రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని చూపుతోంది.

అయితే రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి ఉన్పప్పటికి ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తానననే విషయమై వాణీ విశ్వనాథ్ మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వాణీ విశ్వనాథ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలపై తనకున్న ఆసక్తిని వివరించారు.

త్వరలోనే పవన్‌కళ్యాణ్ కూడ రాజకీయాల్లో పూర్తిస్థాయిలోకి రానున్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన రెండు తెలుగు రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో పోటీ చేయనుంది. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేశారు.

టిడిపిలోనే చేరుతా

టిడిపిలోనే చేరుతా

రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉంది. కానీ, ఇప్పటి వరకు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని గట్టిగా నిర్ణయం తీసుకొంటే మాత్రం తెలుగుదేశం పార్టీలోనే చేరతానని వాణీ విశ్వనాథ్ చెప్పారు. అదేం కాదు. టీడీపీ సిద్ధాంతాలు, నాయకత్వం నచ్చాయి అందుకే ఆ పార్టీలో చేరాలనుకుంటున్నానని వాణీవిశ్వనాథ్ ప్రకటించారు.

సినిమాల్లో నటిస్తానని నాన్న చెప్పారు

సినిమాల్లో నటిస్తానని నాన్న చెప్పారు

మానాన్న జ్యోతిష్యుడు . చిన్నప్పుడే నా జాతకం చూసి సినిమా యాక్టర్ అవుతానని, రాజకీయాల్లో చేరుతానని తన చిన్నప్పుడే నాన్న జ్యోతిష్యం చెప్పారని సినీ నటి వాణీ విశ్వనాథ్ చెప్పారు. నాన్న చెప్పినట్టుగానే సినిమాల్లో నటించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. రాజకీయాల్లో చేరే విషయం మాత్రం ఆలోచిస్తున్నట్టు ఆమె చెప్పారు. నాన్న చెప్పినట్టుగా జరిగితే రాజకీయాల్లోకి చేరక తప్పని పరిస్థితి ఉంటుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

టిడిపి నుండి ఆహ్వనం వచ్చింది

టిడిపి నుండి ఆహ్వనం వచ్చింది

కొంత మంది టిడిపి నాయకులు వచ్చి మాట్లాడారు. మా సినిమా మేనేజర్‌ నగరి చలపతితో పాటు చాలామంది ఆ నియోజకవర్గ నాయకులు ఆహ్వానిస్తున్నారు. ఇంకా రాజకీయాల్లో చేరికపై నిర్ణయం తీసుకోలేదని వాణీ విశ్వనాథ్ ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును తప్పకుండా కలుస్తానని చెప్పారు. రాజకీయాల్లో చేరడం కోసం కాదన్నారు. చంద్రబాబునాయుడు నా అభిమాన నాయకుడు. ఒకసారి ఖచ్చితంగా ఆయన్ను కలుస్తాను. వాణి వల్ల పార్టీకి మేలు జరుగుతుందని ఆయన భావించి అవకాశం ఇస్తే కాదనను. ఒకవేళ ఇవ్వకున్నా బాధపడనని చెప్పారు వాణీ విశ్వనాథ్.

గుర్తింపు ఇచ్చింది తెలుగువారే

గుర్తింపు ఇచ్చింది తెలుగువారే

సినిమా రంగంలో నాకు గుర్తింపునిచ్చింది తెలుగు ప్రేక్షకులేనని వాణీ విశ్వనాథ్ చెప్పారు. టిడిపిలో చేరడం కోసం ఈ మాటలు చెప్పడం లేదన్నారు వాణీ విశ్వనాథ్. నేను మళయాళీ అయినా నన్ను ఆదరించింది తెలుగువారే. అందుకే నాకు ఆంధ్రప్రదేశ్‌ అంటే ఇష్టం. ఇండియాలో నాకు నచ్చిన గొప్ప నాయకుడు చంద్రబాబే. ఆయన నాయకత్వం కిందే పనిచేయాలనుకుంటున్నా. అందుకే టిడిపిలో చేరాలనే ఆసక్తిని చూపుతున్నట్టు వాణీ విశ్వనాథ్ చెప్పారు.

రోజాపై పోటీకి సై

రోజాపై పోటీకి సై

చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ స్థానంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టిడిపి అభ్యర్థిగా వాణీ విశ్వనాథ్‌ను బరిలోకి దింపుతారనే ప్రచారం కూడ సాగుతోంది.అయితే టిడిపిలో చేరిన తర్వాత ప్రత్యర్థి ఎవరైనా ఒక్కటేనని వాణీ విశ్వనాథ్ చెప్పారు. ఇంట్లో కానీ, జీవితంలో కానీ, రాజకీయాల్లో కానీ సరైన ప్రత్యర్థి లేకపోతే థ్రిల్ ఉండదన్నారు వాణీ విశ్వనాథ్.

English summary
Actress Vani Viswanath said that if she joins politics, she will choose TDP as her party.Telugu daily interviewed Vani viswanath on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X