వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'చేయి' పట్టుకుని రాజ్యసభకు కెకె జంప్? (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల నుంచి స్వతంత్ర అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తప్పుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కె. కేశవరావు గట్టెక్కే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్రం నుంచి ఆరు సీట్లు ఉండగా ఏడుగురు అభ్యర్థులు రంగంలో మిగలడంతో పోటీ అనివార్యంగా మారింది. సమైక్య నినాదంపై స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ఓటు వేస్తే కేశవ రావు నెగ్గే అవకాశాలున్నాయి. ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉంటే కాంగ్రెసు నాయకత్వం తన ముగ్గురు అభ్యర్థులను గెలిపించుకోవడానికి వీలుగా తెలంగాణ శాసనసభ్యుల ఓట్లను కేటాయిస్తే కేశవరావుకు కష్టంగా మారి ఉండేది. కాంగ్రెసుతో రహస్య అవగాహనలో భాగంగానే కేశవ రావు పోటీకి దిగారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేశవరావుకు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శానససభ్యుల ఓట్లు పడవచ్చునని అంటున్నారు.

కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉన్న 17 మంది శాసనసభ్యులపై నమ్మకం పెట్టుకుని ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీకి దిగారు. అయితే, ఆయనకు మద్దతు ఇవ్వడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిరాకరించారు. పైగా, ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విప్ జారీ చేసింది. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ రేపు జరుగుతోంది.

కేశవ రావు జంప్

కేశవ రావు జంప్

శాసనసభ ఆవరణలో రీలింగ్‌ను జంప్ చేసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కె. కేశవరావు ఎన్నికల్లో జంప్ చేసి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

చేయి పట్టుకుని ఇలా..

చేయి పట్టుకుని ఇలా..

'చేయి' పట్టుకుని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కె. కేశవరావు రాజ్యసభ ఎన్నికల్లో గట్టెక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

చేతులెత్తేసిన ఆదాల

చేతులెత్తేసిన ఆదాల

జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉన్న 17 మంది శాసనసభ్యులపై నమ్మకంతో కాంగ్రెసు తిరుగుబాటు అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికల్లోకి దిగిన ఆదాల ప్రభాకర్ రెడ్డి చివరి నిమిషంలో చేతులు ఎత్తేశారు.

జెసి ఏమంటారో..

జెసి ఏమంటారో..

ఆదాల ప్రభాకర్ రెడ్డిని సమైక్య నినాదంపై రాజ్యసభ ఎన్నికల్లో గెలిపించుకుంటామని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అంటూ వచ్చారు. ఇప్పుడేమంటారో..

జగన్‌పై వ్యాఖ్యలు

జగన్‌పై వ్యాఖ్యలు

సమైక్య నినాదం పుచ్చుకున్న వైయస్ జగన్‌ను నమ్ముకోవడం వల్లనే తాను పోటీలో ఉన్నానని, జగన్ తన నమ్మకాన్ని వమ్ము చేశాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు.

కలిసిరాని సమైక్యం

కలిసిరాని సమైక్యం

సమైక్య నినాదంతో తమ పార్టీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటామని చెప్పిన జెసి దివాకర్ రెడ్డి మాటలు చెల్లలేదు.

కెకెకు శంకరరావు మద్దతు

కెకెకు శంకరరావు మద్దతు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కె. కేశవరావుకు కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి పి. శంకరరావు మద్దతు పూర్తిగా ఉన్నట్లు చెప్పవచ్చు.

కెకె ఎన్నికల ఏజెంట్ కెటిఆర్

కెకె ఎన్నికల ఏజెంట్ కెటిఆర్

రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కె. కేశవరావుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించనున్నారు.

English summary
As the rebel candidate of Congress Adala Prabhakar Reddy has withdrawn from the contest, Telangana Rastra Samithi (TRS) Candidate K Keshav rao may win in Rajyasabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X