వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్ వైపు అదానీ అడుగులు... వెల్లడించిన సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్ల‌డించారు. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ఆయ‌న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎనిమిది పరిశ్రమల నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడు సంవ‌త్స‌రాలుగా ఏపీ అవార్డు తీసుకుంటోంద‌ని, 15 నెలల్లోనే ఏటీసీ టైర్ల పరిశ్రమను స్థాపించగలిగామని జ‌గ‌న్ చెప్పారు. 2023 ఆగ‌స్టుక‌ల్లా ఈ ప్రాజెక్టు రెండో ద‌శ ప‌నులు పూర్త‌వుతాయ‌ని చెప్పారు.

 మెరుగైన ఉపాధి అవకాశాలుండాలి

మెరుగైన ఉపాధి అవకాశాలుండాలి

ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మెరుగైన ఉపాధి అవ‌కాశాలు ఉండాల‌ని, రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం పూర్తి స‌హ‌కారం అందిస్తోంద‌ని తెలిపారు.
అదానీ, అంబానీ లాంటి పారిశ్రామిక‌వేత్త‌లు ఏపీ వైపు చూస్తున్నార‌ని, గ‌తంలో అదానీ సంస్థ పేరు మాత్ర‌మే చెప్పుకునేవారని, కానీ త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అదానీ అడుగులు ఏపీవైపు ప‌డ్డాయ‌ని చెప్పారు. కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర జీడీపీ వేగంగా వృద్ధి చెందుతోందని, ఆదిత్య బిర్లా, శ్రీ సిమెంట్స్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు.

 భారీ పరిశ్రమలు రాబోతున్నాయి

భారీ పరిశ్రమలు రాబోతున్నాయి


ఈ మూడు సంవత్సరాల్లో ఏపీకి 17 భారీ పరిశ్రమల ద్వారా 39,350 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రాబోయే రెండు సంవత్సరాల్లో మరో 56 పెద్ద కంపెనీలు రానున్నాయని వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈ రంగంలోనూ 31,671 పరిశ్రమలు రూ.8,285 కోట్లు పెట్టుబడులు పెట్టాయని, రూ.1,463 కోట్లతో ఎంఎస్‌ఎంఈల పునరుద్ధరణకు ప్రోత్సాహకాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రస్తావించారు.

Recommended Video

Gowtham Adani కొత్త బిజినెస్ రూ.41,000 కోట్ల పెట్టుబడి... *India | Telugu OneIndia
 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

విశాఖప‌ట్నంలో రెండు నెలల్లో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయ‌డంతోపాటు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేసిన విషయాన్ని జ‌గ‌న్ గుర్తుచేశారు. రాష్ట్రంలో లక్ష వరకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలున్నాయని.. 9 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయ‌నే విష‌యాన్ని తెలిపారు. దేశంలోనే మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్న రాష్ట్రం ఒక్క ఏపీనే అని చెప్ప‌డానికి చాలా గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు.

English summary
Chief Minister YS Jaganmohan Reddy has revealed that steps are being taken for industrial development in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X