రూ.23 లక్షలు లంచంతో అడ్డంగా చిక్కాడు: తెలంగాణ జెఎసి నేత?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఎసిబికి అడ్డంగా దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషర్ ఉప్పు ఏడుకొండలు కోదండరామ్ నాయకత్వంలోని జెఎసి నిజామాబాద్ కన్వీనర్‌గా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఓ మల్టీ నేషనల్ కంపెనీ నుంచి భారీగా లంచం తీసుకుంటూ ఏడుకొండలు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే.

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫైల్ క్లియరెన్స్ కోసం ఏడుకొడలు పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఎసిబి అధికారులు మాటు వేసి లంచం తీసుకుంటుండంగా అతన్ని పట్టుకన్నారు. అతని నుంచి రూ.23 లక్షల 20 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎసిబి డిజి ఆర్పీ ఠాకూర్ చెప్పారు.

 ఆ కంపెనీ గతంలో ఇలా..

ఆ కంపెనీ గతంలో ఇలా..

ఐటిడి సెమెంటే,న్ ఇండియా లిమిటెడ్ కంపెనీ గతంలో విశాఖపట్నం పోర్టు ట్రస్టు, గంగవరం పోర్టు, విశాఖ స్టీల్ ప్లాంట్ పనులను చేపట్టింది. దీనికి సంబంధించి 2010 అక్టోబ్ 1 నుంచి 2014 మే 31వ తేదీ వరకు నాలుగేళ్ల కాలలో వాణిజ్య శాఖ నుంచి కంపెనీకి రూ.4.67 కోట్ల రిఫండ్ ట్యాక్స్ క్లియరెన్స్ చేయాలని కంపెనీకి చెందిన లీగల్ కన్సల్టెంట్ ఐ గోపాలశర్మ, అకౌంట్స్ డిప్యూటీ మేనేజర్ కారంశెట్టి సత్యనారాయణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఏడుకొండలును సంప్రదించారు. దీంతో ఫైల్ క్లియర్ చేయడానికి ఏడుకొండలు 25 లక్షల రూపాయల లంచం అడిగాడు.

 అతనికి లంచం ఇస్తుండగా

అతనికి లంచం ఇస్తుండగా

శుక్రవారంనాడు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లోలని వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో 23 లక్షల 25 వేల రూపాయల లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు మాటువేసి పట్టుకున్నారు. నిందితుడు ఏడుకొండలుతో పాటు కంపెనీకి చెందినవారిని కూడా అరెస్టు చేసినట్లు ఠాకూర్ చెప్పారు.

ఈ వ్యవహారంలో గోపాల శర్మే కీలతం...

ఈ వ్యవహారంలో గోపాల శర్మే కీలతం...

లంచం వ్యవహారంలో కంపెనీ లీగల్ అడ్వయిజర్ గోపాల్ శర్మ కీలకంగా వ్యవహరించారని ఠాకూర్ చెప్పారు. ఆయన ఉమ్మడి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏడుకొండలుతో నేరుగా గోపాల్ శర్మనే వ్యవహారం నడిపారని ఠాకూర్ చెప్పారు.

 ఇలా వచ్చి అలా కలుసుకున్నారు...

ఇలా వచ్చి అలా కలుసుకున్నారు...

కంపెనీ అందించిన మొత్తంతో విజయవాడకు గోపాల్ శర్మ చేరకున్నాడు. అతని వెంట కంపెనీ డిప్యూటీ మేనేజర్ సత్యనారాయణ చివరి దాకా ఉన్నాడు. వారిద్దరు ఓ ప్రైవేట్ ఇన్నోవా కారులో విజయవాడకు చేరుకుని, గేట్‌వే హోటల్లో బస చేశారు. ఏడుకొండలు తన కింద పనిచేసే సూపరింటిండెంట్ అనంతరెడ్డినిహోటల్ వద్దకు పంపించాడు. బెజవాడ శివారులోని కార్యాలయానికి వారంతా వచ్చారు. కార్యాలయంలో మాటా మచ్చట జరిగిన తర్వాత డబ్బులు ఏడుకొండలు అందుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఏడుకొండలుతో పాటు గోపాల్ శర్మ, సత్యనారాయణణ, అనంత రెడ్డిని ఎసిబి అధికారులు అరెస్టు చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Commercial taxes additional commissioner Uppu Edukondal has ben caught by ACB at Vijayawada of Andhra Pradesh.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి