కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామసుబ్బారెడ్డికి, నాకు చెరీ సగం, బాబే పంచుకోమన్నారు: ఆదినారాయణ వీడియో ప్రకంపనలు

|
Google Oneindia TeluguNews

కడప: తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డి కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన సర్కారీ పనుల విషయంలో చేసిన వ్యాఖ్యలు హాట్‌గా మారాయి. ఆదినారాయణ, రామసుబ్బారెడ్డిలు ఒకే నియోజకవర్గానికి చెందినవారు.

చదవండి: 'విజయసాయి వల్లే జైలుకు జగన్, అలా చెప్తే తప్పేంటి.. ఓటుకు నోటులో బాబు పాత్ర లేదు'

ఆదినారాయణ టీడీపీలో చేరే సమయంలోనే రామసుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు బుజ్జగించి చేర్చుకున్నారు. అయితే తాజాగా ఆదినారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సర్కారీ పనుల్లో రామసుబ్బారెడ్డికి, తనకు వాటా ఉంటుందని చెప్పారు.

చదవండి: షాకింగ్: 'బాబుపై మోడీకి ఆ కక్ష, ఇలా తీర్చుకుంటున్నారు, ఫ్యాక్షనిస్టులకు మరో రూపం'

ఏ పని అయినా ఇద్దరికీ వాటా

ఏ పని అయినా ఇద్దరికీ వాటా

ఏ పని అయినా తమ ఇద్దరికీ వాటా ఉంటుందని ఆదినారాయణ రెడ్డి కార్యకర్తల సమావేశంలో అన్నారని తెలుస్తోంది. తనకు, రామసుబ్బా రెడ్డికి ఇద్దరికీ వస్తుందని వ్యాఖ్యానించినట్లుగా వీడియో వెలుగు చూసిందని, దీంతో ఇది హాట్ టాపిక్‌గా మారిందని అంటున్నారు.

ఆ వీడియోలో ఏముందంటే

ఆ వీడియోలో ఏముందంటే


ఇందుకు సంబంధించి వీడియోలు అంటూ జగన్ పత్రిక సాక్షిలో ఆ వీడియోలను కూడా పెట్టారు. ఆ వీడియోలో ఇలా ఉంది. 'నేను మీ ఎమ్మెల్యేను. పక్కకు పోయినప్పుడే మంత్రిని. రామసుబ్బారెడ్డి గారు కూడా ప్రతి రూపాయికి అర్ధరుపాయి భాగం ఉంది ఇక్కడ. అర్ధరూపాయి భాగం ఇవ్వమని సీఎం స్వయంగా చెప్పారు. ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టి చెప్పారు.' అని ఆదినారాయణ చెప్పినట్లుగా ఉంది.

చెరీ సగం వస్తుంది

చెరీ సగం వస్తుంది

ఆ వీడియోలో ఇంకా, 'ఆయన (రామసుబ్బా రెడ్డి) అడిగిన దాంట్లో మనకు సగం వస్తుంది, మనం అడిగిన దాంట్లో ఆయనకు సగం వస్తుంది. వాళ్లు దాంట్లో ఏది విమర్శించినా నేను పట్టించుకోను. మీరు దయచేసి పట్టించుకోవద్దు. మీకు కావాల్సిన పనులు నన్ను అడగండి, ఎస్సెమ్మెస్‌లు పెట్టండి' అని ఉంది.

ఇటీవల ఆదినారాయణ వ్యాఖ్యలు

ఇటీవల ఆదినారాయణ వ్యాఖ్యలు

ఇటీవల, టీడీపీ సమన్వయ భేటీ అనంతరం కూడా కేంద్రంపై ఆదినారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుంటే తమ కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారని చెప్పారు. ఆ తర్వాత అవి తన వ్యక్తిగత అభిప్రాయమని యూటర్న్ తీసుకున్నారు.

English summary
Minister and Telugu Desam Party leader Adinarayana Reddy shocking comments in meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X