• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పరిపాలన తక్కువ.!ప్రతీకారం ఎక్కువ.!వైసీపి రెండేళ్ల పాలనపై నిప్పులు చెరిగిన బీజేపి ఎంపీ జీవిఎల్.!

|

అమరావతి/హైదరాబాద్ : అధికార దుర్వినియోగం, ప్రతిపక్షాలపై కక్షసాధింపు ధోరణినే వైసీపి ప్రభుత్వం రెండేళ్లు నెట్టుకొచ్చిందని బీజేపి రాజ్యసభ సభ్యులు జీవిఎల్ అసంతృప్తి వ్యక్తం చేసారు. వైసీపి ప్రభుత్వం మంచి పాలనకు బదులు కక్షసాధింపు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు. పోలవరం, అమరావతి నిర్మాణాల్లో అవినీతి జరిగిందని, అభివృద్ధి లేకుండావేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని, వీటి గురించి స్పష్టంగా వైసీపి ప్రభుత్వాన్ని నిలదీసామని జీవిఎల్ స్పష్టం చేసారు.

రెండేళ్ల అసమర్ధ వైసీపి పాలన.. జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన బీజేపి ఎంపీ జీవిఎల్.

రెండేళ్ల అసమర్ధ వైసీపి పాలన.. జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన బీజేపి ఎంపీ జీవిఎల్.


అవినీతిపై తెలుగుదేశం పార్టీ, వైసీపి రెండు పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని ప్రజలను మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు.గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం ఓ పద్దతి ప్రకారం విచ్చలవిడిగా అవినీతిని కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తన కక్షసాధింపు చర్యలకు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని అధికారాన్ని దుర్వినియోగపరుస్తోందని వైసీపి ప్రభుత్వం పై జీవిఎల్ నిప్పులు చెరిగారు. రానున్న రోజుల్లో ప్రజలపై మరింత ఆర్థిక భారాన్ని మోపి దిక్కుతోచని పరిస్థితులను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయని జీవిఎల్ ఆందోళన వ్యక్తం చేసారు.

అప్పులెక్కువ.. అభివృద్ది తక్కువ.. రెండేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదన్న జీవిఎల్

అప్పులెక్కువ.. అభివృద్ది తక్కువ.. రెండేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదన్న జీవిఎల్


కాగా గత రెండేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని, అప్పులు మాత్రం ఇబ్బడిముబ్బడిగా చేసారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జీవిఎల్ ధ్వజమెత్తారు. వైసీపి ప్రభుత్వం గత రెండేళ్లుగా అభివృద్ధి అనే మాటనే మరచిపోయిందని, అసలు అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. అభివృద్ధిని పక్కనపెట్టి సంక్షేమ పథకాల పేరుతో నగదు పంచుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసారు బీజేపి ఎంపీ. గడిచిన రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ ఐనా వచ్చిందా అని జీవిఎల్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీసారు.

అప్పులాంధ్రగా మార్చారు.. వైసీపికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్న జీవిఎల్..

అప్పులాంధ్రగా మార్చారు.. వైసీపికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్న జీవిఎల్..


వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులాంధ్రగా మార్చారని, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలసి ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన దుర్వినియోన్ని సరిదిద్దకుండా జగన్ ప్రభుత్వం ఇంకా 1.50 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజల్ని నిండా ముంచిందని పేర్కొన్నారు. వైసీపి ప్రభుత్వం ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ న్యాయ స్థానాల జోక్యంతో పలుమార్లు భంగపాటు పడుతూ వస్తోందని ఆద్దేవా చేసారు.

సామాజిక న్యాయం బీజేపి, జనసేనతోనే సాద్యం.. స్పష్టం చేసిన బీజేపి ఎంపీ..

సామాజిక న్యాయం బీజేపి, జనసేనతోనే సాద్యం.. స్పష్టం చేసిన బీజేపి ఎంపీ..


అవగాహన లేని పాలనతో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుని అనేక సంస్థలతో ఢీకొని బోర్లాపడిందని చురకలంటిచారు జీవిఎల్. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు కోట్లు ఖర్చుచేసి తమ పార్టీ రంగులు వేయడాన్ని కోర్టులు తప్పు పట్టినా సమర్ధించుకున్నారని, ఇప్పుడు ఆలయాలకు కూడా పార్టీ రంగులు వేయడం వైసీపి అహంకార ధోరణకి పరాకాష్టగా కనిపిస్తోందని జీవిఎల్ మండిపడ్డారు. వైసీపి ప్రభుత్వం తన ధోరణి మార్చుకోకుంటే, పరిస్థితి మారకుంటే, అభివృద్ధిపై ధ్యాస పెట్టకుంటే, అవినీతిని అరికట్టకుంటే ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని జీవిఎల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం జరగాలంటే అది బీజేపి, జనసేన పార్టీలతోనే సాద్యమవుతుందని జీవిఎల్ స్పష్టం చేసారు.

English summary
BJP Rajya Sabha MP GVL expressed dissatisfaction that the YCP government has been abusing power and discriminating against the opposition for two years. He was angry that the YCP government was giving priority to orthodoxy politics instead of good governance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X