• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏడీఆర్ లేటెస్ట్ రిపోర్ట్స్: రెండో స్థానంలో వైసీపీ: టీడీపీ మరింత: రూ.100 కోట్లు ఎక్కడివి?

|

న్యూఢిల్లీ: అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తన తాజా నివేదికను వెల్లడించింది. కొన్ని ఆసక్తికరమైన, మరికొన్ని వివాదాస్పదమైన అంశాలు ఈ నివేదికలో కనిపించాయి. రాజకీయ పార్టీలకు ఎక్కడెక్కడి నుంచి, ఏఏ రూాపాల్లో నిధులు అందుతున్నాయనే విషయంపై కూపీ లాగింది. ప్రాంతీయ పార్టీలపై ప్రత్యేకంగా నిఘా పెట్టిందా సంస్థ. గుర్తు తెలియని వ్యక్తులు లేదా సంస్థల నుంచి భారీగా విరాళాలను అందుకున్న ప్రాంతీయ పార్టీల జాబితాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.

టీడీపీకి షాక్: మరో 8 ఎమ్మెల్యేలు జంప్? వైసీపీ నల్లపురెడ్డి సంచలనం.. జనసేనలోకి పరిటాల ఫ్యామిలీ?

రాజకీయ పార్టీలు నిలబడాలంటే..

రాజకీయ పార్టీలు నిలబడాలంటే..

మనదేశంలో ఓ రాజకీయ పార్టీ బతికి బట్టకట్టాలీ అంటే.. డబ్బులు అవసరం. వందలాది మంది పార్టీ నాయకులు, వేల సంఖ్యలో కార్యకర్తల కోసం కొద్దో, గొప్పో డబ్బులను వ్యయం చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచార ఖర్చు గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఎన్నికల్లో ధనం, మద్యం ప్రవాహం ఏ స్థాయిలో పారుతుందో తెలియనిది కాదు. ఎన్నికల ప్రచార ఖర్చుపై లక్ష్మణ రేఖను గీసినా.. ఏ పార్టీ కూడా దానికి లోబడి ఉండదు.. ఉండలేదు. రాజకీయ ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశాన్ని ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఎన్నికల ఖర్చుకు వెనుకాడబోవు.

 ప్రాంతీయ పార్టీలకు అంత డబ్బెక్కడిది?

ప్రాంతీయ పార్టీలకు అంత డబ్బెక్కడిది?

బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ స్థాయి పార్టీలను పక్కన పెడితే.. ప్రాంతీయ పార్టీలకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయనే విషయంపై ఏడీఆర్ సంస్థ ఆరా తీసింది. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా విరాళాలను తీసుకున్న ప్రాంతీయ పార్టీల్లో వైఎస్ఆర్సీపీ రెండో స్థానంలో నిలిచింది. వైఎస్ఆర్సీపీకి 100 కోట్ల రూపాయల విరాళాలు అందినట్లు నిర్ధారించింది. మొత్తం 100.504 కోట్ల రూపాయలు గుర్తు తెలియని వ్యక్తులు లేదా సంస్థల నుంచి అందినట్లు పేర్కొంది.

అయిదో స్థానంలో టీడీపీ

అయిదో స్థానంలో టీడీపీ

ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీ అయిదో స్థానంలో నిలిచింది. టీడీపీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 37.78 కోట్ల రూపాయలు అందాయి. 2018-2019 ఆర్థిక సంవత్సరం అంటే ఎన్నికల ఏడాది. అప్పటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగింది. అయినప్పటికీ.. ఆ పార్టీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అందిన విరాాళాల మొత్తం 37.78 కోట్ల రూపాయలు గానే తేల్చింది ఏడీఆర్.

దాని తరువాత జనతాదళ్ (యునైటెడ్)-8.63, ఎన్డీపీపీ-6.29,డీఎంకే-6, ఆమ్ ఆద్మీ పార్టీ-4.57, జేవీఎం (పీ)-1.134 కోట్ల రూపాయలను అందుకున్నట్లు వెల్లడించింది.

  ఏపీలో ప్ర‌భుత్వంలో ఎక్కువ‌ అప్పుల్లో ఉన్న‌దెవ‌రో తెలుసా?? || AP Ministers Assets And Loan Details
  మొదటి స్థానంలో బీజేడీ

  మొదటి స్థానంలో బీజేడీ

  ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్న పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ). ఒడిశాలో సుదీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగుతోన్న ప్రాంతీయ పార్టీ ఇది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ పార్టీకి సారథ్యాన్ని వహిస్తున్నారు. ఓటమి ఎరుగని ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఈ పార్టీకి మొత్తం 213.543 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. రెండో స్థానంలో వైఎస్ఆర్సీపీ ఉండగా.. శివసేన మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేనకు 60.73 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. 39.134 కోట్ల రూపాయలతో జనతాదళ్ (సెక్యులర్) మూడోస్థానంలో నిలిచింది.

  English summary
  As per the association for democratic reforms (ADR) YSRCP received Rs 100.504 Crores from unknown sources for Financial Year 2018-19. It stands at second place among regional parties, while TDP received Rs 37.78 Crore from unknown sources.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more