హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అండర్ వియర్‌లో గోల్డ్: సిటీలో అఫ్గాన్ వ్యక్తి పట్టివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ ఓ అప్గానిస్తాన్ వ్యక్తి కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. మంగళవారం ఉదయం అధికారులు అతన్ని పట్టుకున్నారు.

ఆ వ్యక్తి జెడ్డా నుంచి హైదరాబాద్ వచ్చాడు. అండర్ వియర్‌లో, బూట్ల సోల్స్‌లో బంగారాన్ని దాచిపెట్టి అక్రమంగా రవాణా చేయడానికి పూనుకున్నాడు. అతని నుంచి కస్టమ్స్ అధికారులు 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 Afghan man caught trying to smuggle gold in underwear

అఫ్గానిస్తాన్ వ్యక్తి మెటల్ డిటెక్టర్ నుంచి నడిచినప్పటికీ తొలుత దాన్ని గుర్తించలేదు. ఆ వ్యక్తి నాలుగు జతల అండర్ వియర్స్ ధరించి, వాటి కింద బంగారాన్ని దాచిపెట్టాడు. మెటల్ డిటెక్టర్ తొలుత కనిపెట్టకపోయినా అధికారులు అన్ని ఆపి తనిఖీ చేశారు.

తనిఖీ చేయగా ఆ వ్యక్తి అండర్ వియర్స్‌లో మూడు బంగారం బిస్కట్లు, బూట్ల సోల్స్‌లో రెండు బంగారం బిస్కట్లు పట్టుబడ్డాయి.

English summary

 Customs officials intercepted an Afghan national early on Tuesday morning and foiled a smuggling attempt at the RGI airport, Shamshabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X