• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గంగవరం పోర్టు బదిలీకి జగన్ సర్కార్ ఆమోదం-కేబినెట్ లో రహస్య ముద్ర-రూ.645 కోట్లకే

|

ఏపీలో ప్రైవేటు పోర్టుల్లో ఒకటైన గంగవరం వాటాల విక్రయం విషయంలో అదానీ గ్రూప్ తన పంతం నెగ్గించుకుంది. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయవంతంగా ఏపీ ప్రభుత్వ వాటా సహా మెజారిటీ వాటాల్ని దక్కించుకుంది. ఈ మేరకు జగన్ సర్కార్ కూడా రహస్యంగా నిర్ణయాలు తీసుకుని మరీ సహకరించింది. దీంతో విశాఖ ఒడ్డున ఉన్న గంగవరం పోర్టు ఇప్పుడు అదానీ పోర్ట్స్ పరమైంది. ఇందులో ప్రధాన వాటాదారైన డీవీఎస్ రాజు కుటుంబం, విండీ లేక్ సైడ్ కంపెనీలతో పాటు ప్రభుత్వ వాటాను సైతం అంతే తక్కువ ధరకు అదానీ చేజిక్కించుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

 గంగవరం పోర్టుపై అదానీ కన్ను

గంగవరం పోర్టుపై అదానీ కన్ను

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతకు ముందు మన రాష్ట్రానికి చెందిన వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రైవేటు పోర్టులపై అదానీ గ్రూప్ కన్నేసింది. ముందుగా నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టును చేజిక్కించుకున్న అదానీ గ్రూప్.. ఆ తర్వాత విశాఖ జిల్లాలోని గంగవరం పోర్టుపై కన్నేసింది. ఇందులో డీవీఎస్ రాజు, విండీ లేక్ సెడ్ కంపెనీలకు ఉన్న వాటాల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంప్రదింపులు జరిపి వాటి స్వాధీనానికి సిద్ధమైంది. ఇంతవరకూ ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా ఏపీ ప్రభుత్వం మధ్యలో దూరడం వివాదాస్పదమైంది.

 గంగవరం వాటాల అమ్మకం వివాదం

గంగవరం వాటాల అమ్మకం వివాదం

గంగవరం పోర్టు నిర్మాణం కోసం గతంలో ఏపీ ప్రభుత్వం డీవీఎస్ రాజు, విండీ లేక్ సైడ్ కంపెనీలతో కూడిన కన్సార్టియానికి 2800 ఎకరాల భూములు ఇచ్చింది. దీనికి ప్రతిఫలంగా ఈ పోర్టులో 10.4 శాతం ప్రభుత్వానికి దక్కింది. ఈ లీజు సమయం ముగిసేవరకూ ఈ వాటాలు వాటాదారుల చేతుల్లోనే ఉంటాయి. వాటిపై వచ్చే ప్రతిఫలం అందుకుంటారు. లీజు ముగిసిన తర్వాత తిరిగి పోర్టు ప్రభుత్వ పరం కావాల్సి ఉంటుంది. అయితే తాజాగా అదానీ గ్రూప్ కు చెందిన అదానీ పోర్ట్స్ గంగవరం పోర్టుపై కన్నేయడం, డీవీఎస్ రాజు,విండీ లేక్ సైడ్ కంపెనీలు తమ వాటాల్ని అదానీ గ్రూప్ కు అమ్మేసుకోవాలని నిర్ణయించుకోవడం చకచకా జరిగిపోయాయి. అదే సమయంలో వైసీపీ సర్కార్ కూడా తమ వాటా అయిన 10.4 శాతం షేర్లను కూడా అదానీ గ్రూప్ కు అమ్ముకోవాలని వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.

 ఇరుకునపడ్డ జగన్ సర్కార్

ఇరుకునపడ్డ జగన్ సర్కార్

గంగవరం పోర్టులో డీవీఎస్ రాజు కుటుంబం, విండీ లేక్ సైడ్ కంపెనీలకు ఉన్న వాటాల్ని అదానీ గ్రూప్ కు అమ్ముకోవడం ప్రైవేటు వ్యవహారం. అయితే ఇందులో ఏపీ ప్రభుత్వం దూరడం మాత్రం అనుమానాలకు తావిచ్చింది. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతున్న వేళ గంగవరం పోర్టుపై అదానీ గ్రూప్ కన్నేయడంపై విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం అవసరం లేకపోయినా గంగవరం పోర్టులో తనకున్న 10.4 శాతంవాటాను విక్రయించాలని నిర్ణయించడం ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడం వివాదంగా మారింది. దీనిపై హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. విచారణ కూడా కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది.

 రంగంలోకి అదానీ సోదరులు

రంగంలోకి అదానీ సోదరులు

ఎప్పుడైతే గంగవరం పోర్టులో ఏపీ ప్రభుత్వ వాటా విక్రయంపై అభ్యంతరాలు మొదలయ్యాయో అప్పుడే ఈ వ్యవహారమేదీ తేడా కొడుతోందని ఆందోళన చెందిన అదానీ బ్రదర్స్ రంగంలోకి దిగారు. అమరావతికి వచ్చి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వాటాల విక్రయం సాఫీగా ముగించాలని కోరారు. దీంతో ప్రభుత్వం కూడా ఆ మేరకు హామీలు ఇచ్చి పంపింది. జగన్ తో అదానీ సోదరులు భేటీ అయిన విషయాన్ని అటు అదానీ గ్రూప్ కానీ, ఇటు ఏపీ ప్రభుత్వం కానీ బయటపెట్టలేదు. అక్కడితో రహస్య నిర్ణయాలు మొదలయ్యాయి. ఆ తర్వాత మరిన్ని ట్విస్ట్ లు ఎదురయ్యాయి.

 జగన్ కేబినెట్ రహస్య తీర్మానం

జగన్ కేబినెట్ రహస్య తీర్మానం

గంగవరం పోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటా అదానీ గ్రూప్ కు కట్టబెట్టడానికి వైసీపీ సర్కార్ ఎప్పుడైతే సిద్ధపడిందో అప్పటి నుంచీ దీనిపై విమర్శలు మొదలయ్యాయి. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ వ్యవహారాన్ని రహస్యంగా ముగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే అదానీ సోదరులు జగన్ తో రహస్యంగా భేటీ అయినట్లు చెప్తున్నారు. ఆ తర్వాత మరింత వేగంగా పావులు కదిపిన ప్రభుత్వం.. తాజా కేబినెట్ భేటీలో గంగవరం పోర్టులో తమ వాటాను అదానీ గ్రూప్ కు బదిలీ చేసే నిర్ణయానికి పచ్చజెండా ఊపింది. అయితే ఇదంతా రహస్యంగానే జరిగిపోయింది. ఇంత పెద్ద వ్యవహారాన్ని కేబినెట్ బ్రీఫింగ్ లోనూ సర్కార్ బయటపెట్టేలేదు.

  Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety
   చీప్ గా రూ.645 కోట్లకు అమ్మేసుకున్న జగన్ సర్కార్

  చీప్ గా రూ.645 కోట్లకు అమ్మేసుకున్న జగన్ సర్కార్

  గంగవరం పోర్టులో ప్రస్తుతం డీవీఎస్ రాజు కుటుంబం, విండీ లేక్ సైడ్ కంపెనీలకు ఉన్న వాటాల్ని ఒక్కొక్కటి రూ.120 చొప్పున వారు అదానీ గ్రూప్ కు అమ్ముకున్నారు. విచిత్రంగా ప్రభుత్వం కూడా అదే రేటుకు అదానీ గ్రూప్ కు తమ కున్న 10.4 శాతం వాటాల్ని అమ్మేసుకుంది. 2009 నుంచి 30 ఏళ్ల పాటు అంటే 2039 వరకూ ఈ పోర్టు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేలా అప్పట్లో ఒప్పందం జరిగింది. ఇందుకోసం ప్రభుత్వం విశాఖ జిల్లాల్లో 2800 ఎకరాలు ఇచ్చి 10.4 శాతం వాటా పొందింది. ఇప్పుడు దాన్ని కేవలం రూ.645 కోట్లకు అదానీ గ్రూప్ కు అమ్మేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం అక్కడ భూముల విలువ ప్రకారం చూసినా, మార్కెట్ లెక్కల ప్రకారం చూసినా ప్రభుత్వ వాటా అయిన 10.4 శాతానికి బదులుగా 9 వేల కోట్లు వస్తాయని ఓ అంచనా. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.645 కోట్లకు అదానీ పోర్ట్స్ కు అమ్ముకోవాల్సిన కర్మేం పట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  English summary
  after reported adani brothers meeting with cm jagan, ap government has taken series of secret decisions on gangavaram port transfer to adani group.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X