India
  • search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాదీ బాలినేని పరిస్ధితే-సొంత పార్టీలో కుట్రలపై కోటంరెడ్డి ఫైర్-వేలు పెట్టొద్దని హెచ్చరికలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ముందస్తు ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుంటున్న అధికార వైసీపీకి సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు తప్పడం లేదు. ముఖ్యంగా సీఎం జగన్ కు సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న నేతలు ఒకరి వెంట మరొకరు బయటికి వచ్చి తమపై సొంత పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తుండటం సంచలనం రేపుతోంది. నిన్న ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని ఇదే తరహా ఆరోపణలు చేయగా... ఇవాళ ఆయనకు సంఘీభావంగా బయటికొచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా తన నియోజకవర్గంలోనూ ఇదే పరిస్ధితి ఉందన్నారు.

వైసీపీలో అంతర్గత పోరు

వైసీపీలో అంతర్గత పోరు

రాష్ట్రంలో మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న వైసీపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా అంతర్గత పోరు కనిపిస్తోంది. ముఖ్యంగా నేతల మధ్య సఖ్యత ఉండాల్సిన తరుణంలో పరస్పరం కుట్రలకు తెరలేపుతున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ప్రత్యర్ధుల్ని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పలు చోట్ల ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. దీంతో ఇక సహనం నశించిన నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగానే తమకు ఎదురవుతున్న పరిస్ధితుల్ని ఏకరువు పెడుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బాలిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుట్ర వ్యాఖ్యలు

బాలిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుట్ర వ్యాఖ్యలు

ప్రకాశం జిల్లాలో నిన్న మొన్నటివరకూ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత, సీఎం జగన్ కు దూరపు బంధువు కూడా అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. నిన్న హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టి తనపై పార్టీలో సొంత నేతలే కుట్రలు చేస్తున్నారని వాపోయారు. జనసేన నేతలపై పెట్టిన కేసుల్ని పవన్ కళ్యాణ్ అడిగారని ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇచ్చానని, దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని బాధపడ్డారు. సొంత పార్టీ నేతల కుట్రలపై బాలినేని చేసిన వ్యాఖ్యలు వైసీపీలో అంతర్గత పోరుకు నిదర్శనంగా నిలిచాయి.

బాలినేనికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీభావం

బాలినేనికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీభావం

సొంత పార్టీ నేతల రాజకీయాలపై నిన్న బాలినేని చేసిన కామెంట్లపై ఇవాళ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. బాలినేని శ్రీనివాసులు రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు విచారకరమన్నారు. తనపని తను చేసుకుంటూ పోయే తిరుగులేని వ్యక్తి బాలినేని శ్రీనివాసులురెడ్డి అని ఆయన అన్నారు.

వ్యక్తిత్వ విషయాలపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు. రాజకీయ విమర్శలు ఆరోగ్యకరంగా ఉండాలని, అంతే కాని ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వైసీపికి ప్రకాశంలో పర్యాయ పదం బాలినేని అని కోటంరెడ్డి అన్నారు.

వైఎస్సార్ కి అంత్యంత సన్నిహితుడిగా ఉండి, ఆయన మరణం తర్వాత జగన్ వెంట నడిచారని గుర్తుచేశారు.

మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన వ్యక్తి బాలినేని అన్నారు. అలాంటి వ్యక్తి సొంతపార్టీ వ్యక్తులు ద్రోహం చేస్తున్నారని ఆయన బాధపడటం నాకు బాదేసిందని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా సొంతపార్టీ నేతలు ఎవ్వరు ప్రవర్తించకూడదని ఆయన హితవు పలికారు.

నాదీ బాలినేని సమస్యేనన్న కోటంరెడ్డి

నాదీ బాలినేని సమస్యేనన్న కోటంరెడ్డి

బాలినేని సమస్య ఎలా ఉందో అదే సమస్యతో తాను కూడా ఇబ్బంది పడుతున్నానని కోటంరెడ్డి తెలిపారు. వైసీపీలో కొంతమంది ముఖ్యనేతలకి, ఎమ్మెల్యేలకి ఇతర నియోజకవర్గాల్లో జోక్యం ఎక్కువైందన్నారు. వైసీపీ పెట్టక ముందు నుంచి పార్టీలో కష్టం చేసిన వ్యక్తుల్లో తాను ఒక్కడిననన్నారు.

పార్టీని ఎలా ముందుకు తీస్కెళ్లాలి, ఎలా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలో చూసుకోకుండా ఇతర నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారని కోటంరెడ్డి వాపోయారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలీని వైసీపీలోని కొంతమంది ముఖ్య నేతలు నా నియోజవర్గంలో వేలు పెడుతున్నారన్నారు.

తనకు నిజంగా బాధేస్తుందన్నారు. ఇతర నియోజకవర్గాల నేతలు రూరల్ లో తనను బలహీనం చేయాలని చూస్తున్నారన్నారు. అది వాళ్ళ వల్ల కాదన్నారు. రూరల్ ప్రజల అండ, సీఎం జగన్ ఆశీస్సులు ఉన్నంత వరకు తననేమీ చేయలేరని కోటంరెడ్డి హెచ్చరించారు.

జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో కలగజేసుకునే సంబంధాలు నాకు ఉన్నాయి, తాను కలగజేసుకోనన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ ని నేను రాజకీయ శత్రువుగా, రాజకీయ పోటీదారుడిగా చూడను, రాజకీయ సహచరుడిగానే చూస్తానన్నారు. పక్క నియోజకవర్గాల్లో ఏ పెళ్లి ఉన్నా, శుభకార్యాలు ఉన్నా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి చెప్పే వెళ్తానన్నారు. ఎవరిల్లు వారు చక్కదిద్దుకోవాలి, పక్క ఇళ్లలోకి తొంగిచూసే పద్దతి మానుకోవాలని కోటంరెడ్డి హితవు పలికారు.

English summary
nellore rural kotamreddy sridhar reddy on today extended his support to another ysrcp leader balineni srinivas reddy who is facing troubles from own party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X